Ads
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఇవాళ ఐపీఎల్ 2022 లో మొదటి మ్యాచ్ ఆడబోతోంది. పుణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో హైదరాబాద్ జట్టు పోటీ పడబోతోంది. గత సీజన్లో పేలవంగా ఆడటంతో పట్టిక లో చివరి స్థానంలో నిలిచింది.
Video Advertisement
ఇప్పటి వరకు రెండు జట్లు 15 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో హైదరాబాద్ జట్టు ఎనిమిది సార్లు గెలిచింది. గత సీజన్లో జట్టుకు ప్రధాన బలంగా ఉన్న రషీద్ ఖాన్, డేవిడ్ వార్నర్ ఈ సీజన్ లో వేరే జట్లకి ఆడబోతున్నారు.
భువనేశ్వర్ కుమార్, నటరాజన్‌లను మెగా వేలంలో తిరిగి సొంతం చేసుకున్నారు. వాషింగ్టన్ సుందర్, రాహుల్ త్రిపాఠి, జేన్సన్, నికోలస్ పూరన్ లాంటి ప్లేయర్స్ కూడా ఈసారి ఉన్నారు. బ్యాటింగ్ భారం కెప్టెన్ కేన్ విలియమ్సన్, రాహుల్ త్రిపాఠి, పూరన్ మీద ఎక్కువగా పడే అవకాశం ఉంది. విదేశీ ఆటగాళ్లు విషయానికొస్తే విలియమ్సన్‌తోపాటు పూరన్, షెఫర్డ్, మర్కరమ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ మెగా ఆక్షన్ లో ట్రెంట్ బౌల్ట్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్ లాంటి ప్లేయర్లని కొనుగోలు చేసింది. ఇవాళ మ్యాచ్ ఉండడంతో రాజస్థాన్ రాయల్స్ జట్టు ట్విట్టర్‌లో ఒక ఆరెంజ్ జ్యూస్ ఫోటో పోస్ట్ చేసి గుడ్ మార్నింగ్ అని ట్వీట్ చేసింది. ఇది సన్‌రైజర్స్ జట్టు గురించి అవ్వడంతో వీళ్లేంటి ఇలా అవుతున్నారు. ఇవాళ మ్యాచ్ గెలిచిన తర్వాత ఇదే మాట మాట్లాడండి అంటూ సోషల్ మీడియాలో మీమ్స్ ట్రెండ్ అవుతోంది.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
End of Article