Ads
అక్టోబర్ 22వ తేదీ రానే వచ్చింది. రామరాజు ఫర్ భీమ్ టీజర్ కూడా విడుదలైంది. దీని గురించి ఎంత చెప్పినా కూడా తక్కువే. అంత అద్భుతంగా ఉంది. అసలు ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఇంత ఆసక్తిగా ఎదురు చూడడానికి, ఒకటి కాదు చాలా కారణాలు ఉన్నాయి.
Video Advertisement
ముందు రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్రీమ్ కాంబినేషన్, రాజమౌళి దర్శకత్వం, తో సినిమా అభిమానుల్లో మొదలైన ఎగ్జైట్మెంట్, తర్వాత ఐదు భాషల్లోనూ విడుదలైన మోషన్ పోస్టర్,ఆ తర్వాత రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా విడుదలైన భీమ్ ఫర్ రామరాజు వీడియో, అలాగే ఆర్ ఆర్ ఆర్ ఆర్ టీం నుండి వచ్చే అప్డేట్స్ తో ఆ ఎగ్జైట్మెంట్ కొంచెం కొంచెం గా పెరుగుతూనే ఉంది.
ఇవాళ విడుదలైన టీజర్ కూడా ఎక్స్పెక్టేషన్స్ కి మించి ఉంది. కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్ లుక్ చాలా కొత్తగా ఉంది. ఈ సినిమా టీజర్స్ చూస్తుంటే తెలుగు సినిమా స్థాయి ఇంకా పెరగబోతోంది అని అనిపించేలా ఉన్నాయి. టీజర్ 11 గంటలకి అనడంతో అందరూ ఆర్ఆర్ఆర్, అలాగే ఈ సినిమాకు సంబంధించిన వాళ్ల సోషల్ మీడియా హ్యాండిల్స్ చెక్ చేస్తూ ఉన్నారు.
కానీ సడన్ గా రాజమౌళి ఇంకొక అరగంట ఆగాలి అని ట్వీట్ చేశారు. దానిపై రామ్ చరణ్ స్పందించారు. జూనియర్ ఎన్టీఆర్ కూడా సరదాగా కౌంటర్ వేశారు. అలా అరగంట గ్యాప్ రావడంపై, ఇంకా దానికి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సరదాగా రిప్లై ఇవ్వడంపై సోషల్ మీడియాలో ఈ విధంగా మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11 #12
End of Article