బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న సినిమా కిసీ కా భాయ్ కిసీ కీ జాన్. ఈ సినిమా తమిళ్ లో అజిత్ హీరోగా నటించిన వీరం సినిమా రీమేక్. ఇదే సినిమాని తెలుగులో పవన్ కళ్యాణ్ కాటమరాయుడు పేరుతో రీమేక్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా హిందీలో రీమేక్ అవుతోంది.
Video Advertisement
ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ పక్కన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే పూజా హెగ్డే అన్నయ్య పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్, అలాగే వదినగా భూమిక నటిస్తున్నారు. ఈ సినిమా పేరుకి రీమేక్ అయిన కూడా బాలీవుడ్ వాళ్ళు వాళ్ళ స్టైల్ కి తగ్గట్టుగా చాలా మార్పులు చేశారు.
సాధారణంగా బాలీవుడ్ సినిమాలని ఈ మధ్య తెలుగులో ట్రోల్ చేయడం చాలా ఎక్కువగా జరుగుతోంది. ఇప్పుడు ఈ సినిమాలో పాటలని కూడా అలాగే కామెంట్ చేశారు. ఇప్పుడు తెలుగు సినిమా స్థాయి పెరిగిపోయింది కాబట్టి తెలుగు నటీనటులని హిందీ సినిమాల్లో తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి. అంతే కాకుండా ఈ సినిమాలో బతుకమ్మకి సంబంధించి ఒక తెలుగు పాట కూడా ఉంది.
ఇప్పుడు ఈ సినిమా నుండి ఏంటమ్మా అనే మరొక పాట రిలీజ్ చేశారు. అందులో సల్మాన్ ఖాన్, వెంకటేష్, పూజా హెగ్డే మిగిలిన నటీనటులు అందరూ కలిసి డాన్స్ వేస్తున్నారు. అయితే ఈ పాటలో రామ్ చరణ్ కూడా కనిపిస్తున్నారు. అంతకుముందు సల్మాన్ ఖాన్ చిరంజీవి హీరోగా నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రామ్ చరణ్ కూడా సల్మాన్ ఖాన్ సినిమాలో అతిధి పాత్రలో కనిపిస్తున్నారు.
అంతకుముందు రామ్ చరణ్ సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన ప్రేమ్ రతన్ ధన్ పాయో తెలుగు డబ్బింగ్ కి సల్మాన్ ఖాన్ కి డబ్ చేశారు. అయితే ఈ పాటలో స్టెప్స్ మాత్రం కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. రామ్ చరణ్ చేత ఇలాంటి స్టెప్స్ వేయించారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.
#1
#2
#3
#4
#5
#6
#7
#8
#9
#10
#11
#12
#13
#14
#15
#16
#17
#18
watch video :