యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న సినిమా ‘స్కంద’. ఈ చిత్రం పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రంలో రామ్ సరసన యంగ్ హీరోయిన్ శ్రీలీల నటిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం సెప్టెంబర్ 15న ఐదు భాషలలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు.

Video Advertisement

శనివారం (ఆగష్టు 26 ) ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ముఖ్య అతిధిగా బాలయ్య బాబు విచ్చేసారు. ట్రైలర్ విడుదల చేసారు. దెబ్బ తాకితే సౌండ్ గోల్కోండ దాటాలా…శాల్తీ శాలిబండ చేరాలా అంటూ రామ్ చెప్పిన డైలాగ్ ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. సాధారణంగా బాలయ్య బాబు స్పీచ్ ఏ రేంజ్ లో కొత్తగా చెప్పనవసరంలేదు. సోషల్ మీడియా మొత్తం ట్రెండ్ అవ్వడం పక్కా. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలయ్య బాబు మాట్లాడుతుంటే…రామ్, శ్రీలీల నవ్వుఆపుకుంటున్నారు అంటూ సోషల్ మీడియా లో వీడియో ప్రస్తుతం ట్రెండ్ అవుతుంది. ఆ వీడియో ఒక లుక్ వేసుకోండి.

watch video: