తెలుగు సినిమాలకి ఎంత క్రేజ్ ఉందో, సీరియల్స్ కి కూడా దాదాపు అంతే క్రేజ్ ఉంది. సీరియల్ నటులని తమ ఇంట్లో వాళ్ళ లాగా ఆదరిస్తారు ఆడియన్స్.  సీరియల్ నటులు కూడా తరచుగా సోషల్ మీడియా ద్వారా అభిమానులతో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. జీ తెలుగులో ప్రసారం అయ్యే త్రినయని సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైన నటి అషికా పదుకొనే.

అషికా అంతకుముందు కథలో రాజకుమారి సీరియల్ తో పాటు ఇంకా కొన్ని సీరియల్స్ లో కూడా నటించారు. అషికా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. అయితే ఇటీవల అషికా ఇంస్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ చేశారు. ఇందులో అషికా ఒక తమిళ్ పాటకి డాన్స్ వేస్తున్నారు. ఈ వీడియో పోస్ట్ చేస్తూ, “పోస్ట్ చేయాలి అని అనిపించింది. చేశాను. తర్వాాత డిలీట్ చేయవచ్చు” అని రాశారు. కొన్ని లక్షల మంది ఈ వీడియోని చూశారు. దాంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

watch video :