Ads
కష్టాలు మనిషిని మరింత దృఢంగా చేస్తాయి. ఇక అవకాశాలు అట్టడుగున ఉన్నవారిని కూడా అందలం ఎక్కేలా చేస్తాయి. ఈ విషయం బుల్లితెర నటి పవిత్ర జైరామ్ జీవితంలో నిజమైంది. అలా జీవిత ప్రయాణంలో ఆమె సంతోషకరమైన దశకు చేరుకున్నారు.
Video Advertisement
ఆమె ప్రస్తుతం జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘త్రినయని’ సీరియల్ తో తెలుగు ఆడియెన్స్ ని తన నటనతో ఆకట్టుకున్నారు. పవిత్ర జైరామ్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితం గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. పవిత్ర జైరామ్ మాట్లాడుతూ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపనతో మాండ్య నుండి బెంగళూరు వచ్చినట్టుగా తెలిపారు. ఎక్కువగా చదువుకోలేదని, దాంతో హౌజ్ కీపింగ్ పని కూడా కొన్ని రోజులు చేశానని తెలిపారు. బట్టల షాప్ లో, లైబ్రరీలో కూడా ఉద్యోగాలు చేసినట్టుగా చెప్పారు.
అయితే తను ఇబ్బందులు పడటం చూసిన ఒక ఫ్రెండ్ డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ అయిన సిరిగంధం శ్రీనివాసమూర్తి నంబర్ ఇచ్చారు. దాంతో వెళ్లి ఆయనను కలిశాను. అయితే ఆయన అప్పటికే గిరిజనుల మీద డాక్యుమెంటరీ సినిమాలు తీస్తున్నారు. ఆయన డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ఉద్యోగం ఇచ్చారు. ఆ క్రమంలో కన్నడ సీరియల్స్‌లో చేయాలనే ఐడియా వచ్చింది. దాంతో సీరియల్ ఆడిషన్స్‌కి వెళ్ళేదాన్నని, కానీ చిన్నచిన్న రోల్స్ వచ్చేవని అన్నారు. ఆ తరువాత ‘జోకాలి’ అనే కన్నడ సీరియల్‌లో హీరోకి చెల్లెలి క్యారెక్టర్ వచ్చింది.అనంతరం తెలుగులో ‘నిన్నే పెళ్లాడుతా’ అనే సీరియల్ ఛాన్స్ వచ్చింది. అయితే ఆ సమయానికి నాకు తెలుగు కొంచెం కూడా తెలియదని, కానీ అందులో నటించేవారంతా తెలుగువాళ్లే. వాళ్ళు తెలుగులో మాట్లాడుతుంటే ఏమి అర్దం కాక సైలెంట్ ఉండేదాన్ని. దాంతో సీరియల్స్ వద్దని, పారిపోవాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే నా పరిస్థితి అర్ధం చేసుకున్న సహనటులు ధైర్యం చెప్పారు. అలాగే తెలుగు చదవడం, రాయడం నేర్పారు. అలా నేను తెలుగు నేర్చుకున్నానని తెలిపారు. తెలుగులో బుచ్చినాయుడు కండ్రిగ అనే సినిమాలో నటించానని, కరోనా టైమ్ లో ఓటీటీలో రిలీజ్ అయిందని చెప్పారు. ప్రతి రోజూ జిమ్‌కు వెళ్తానని, గ్లామర్ రంగంలో ఉన్నప్పుడు అందం, ఆరోగ్యం రెండింటిని కాపాడుకోవాలని అన్నారు. తన ఫ్యామిలీ గురించి చెప్తూ తన భర్త పేరు చంద్రకాంత్ అని, ఒక పాప, ఒక బాబు ఉన్నారని తెలిపారు. Also Read: ఇలాంటివి మన “సీరియల్స్” లో మాత్రమే జరుగుతాయి అనుకుంటా..? ఈ సీన్ చూస్తే షాక్ అవ్వాల్సిందే..!
End of Article