బాలీవుడ్ సినిమాలో త్రిష..! హీరో ఎవరంటే..?

బాలీవుడ్ సినిమాలో త్రిష..! హీరో ఎవరంటే..?

by Mohana Priya

తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి స్టార్ హీరోయిన్ అనే గుర్తింపు సంపాదించుకున్నారు త్రిష. త్రిష ఇండస్ట్రీలోకి వచ్చి 20 సంవత్సరాలు దాటినా కూడా ఇంకా హీరోయిన్ పాత్రలు చేస్తూనే ఉన్నారు. పెద్ద స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే, మరొక పక్క ఫిమేల్ ఓరియంటెడ్ సినిమాల్లో కూడా నటిస్తున్నారు.

Video Advertisement

ఇటీవల త్రిష హీరోయిన్ పాత్రను నటించిన లియో సినిమా విడుదల అయ్యి త్రిషకి గుర్తింపు పెంచింది. దాంతో ఇప్పుడు మళ్లీ చాలా సంవత్సరాల తర్వాత త్రిష బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారు. అది కూడా సల్మాన్ ఖాన్ పక్కన.

Trisha

సల్మాన్ ఖాన్ హీరోగా పంజా డైరెక్టర్ విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఒక సినిమా రాబోతోంది. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తున్నట్టు సమాచారం. 2010 లో అక్షయ్ కుమార్ పక్కన కట్టా మీఠా అనే సినిమాలో త్రిష నటించారు. ఈ సినిమాకి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. ఇప్పుడు మళ్లీ దాదాపు 13 సంవత్సరాల తర్వాత త్రిష హిందీ సినిమాలో నటిస్తున్నారు. అంతే కాకుండా పాతిక సంవత్సరాల తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్న సినిమాని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

ఇది మాత్రమే కాకుండా, తెలుగులో చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంభర సినిమాలో కూడా త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. అలా ఇప్పుడు కూడా వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు హీరోయిన్ త్రిష. ఇవి మాత్రమే కాకుండా, మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న సినిమాలో కూడా త్రిష నటిస్తున్నారు. ఇంకా కొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి. వీటికి సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


You may also like

Leave a Comment