మాటలతోనే ఎదుటి వారిని కట్టివేయగల చాతుర్యం కలిగిన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. మాటల మాంత్రికుడిగా ఆయనకి ఉన్న ఈ ఒక్క బిరుదు చాలు ఆయన మాటకారితనం ని చెప్పడానికి. ఆయన మాటలు ఎంత ప్రత్యేకంగా ఉంటాయో ఆయన దర్శకత్వం వహించే సినిమాలు కూడా అంటే ప్రత్యేకంగా ఉంటాయి. స్వయంవరం ఈ సినిమాతో మాటల రచయితగా పరిచయం అయినా ఆయన నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆయనకి ఉన్న ఈ ప్రత్యేకమైన టాలెంట్ వలన చేసిన కొద్ది సినిమాలతోనే ఎంతో ఖ్యాతిని గడించారు. ఇలాంటి త్రివిక్రమ్ గారి జీవితంలో చాలా మందికి తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది.

ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సోదరుడికి ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తెను పెళ్లిచూపులు చూసేందుకు రావాల్సి ఉందని కోరగా వెళ్లిన మాటల మాంత్రికుడు తనకు అక్కకి బదులుగా చెల్లి నచ్చింది ఆమెనే పెళ్లి చేసుకుంటా అని చక్కగా అక్కడ ఉన్న వాళ్లు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. కానీ అప్పటికే మాటల మాంత్రికుడి మాయలో పడిన సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు త్రివిక్రమ్ గారికి ఎలాంటి చెడు అలవాట్లు లేవు, ఇంకా అబ్బాయి కూడా చాలా మంచివాడు అని అందరికీ చెప్పి త్రివిక్రమ్ గారు రెండవ కూతురు అయిన సౌజన్య గారితో పెళ్ళికి ఒప్పించారు.

అయితే పెద్ద కూతురు పెళ్లి అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందిగా మాటల మాంత్రికుడికి షరతు విధించారు. షరతు ప్రకారం సౌజన్య గారిని పెళ్లి చేసుకున్న త్రివిక్రమ్ గారికి ప్రస్తుతం ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. త్రివిక్రమ్ గారి భార్య గానే కాకా సౌజన్య గారు మంచి నృత్యా కళాకారిణిగా కూడా స్వతహాగా గుర్తింపు పొందారు. ప్రస్తుతం త్రివిక్రమ్ గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ లో ఒక కొత్త సినిమాని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్, త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ వచ్చిన సినిమా హిట్ అవ్వడంతో రాబోయే సినిమా పై భారీ అంచనాలే వినిపిస్తున్నాయి.