Ads
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మూవీ రూపొందుతున్న విషయం తెల్సిందే. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఒక ఆసక్తికరమైన అప్డేట్ నెట్లో హల్చల్ చేస్తోంది.
Video Advertisement
మహేశ్, త్రివిక్రమ్ మూవీకి అధికారికంగా పేరును ప్రకటించలేదు. ఎస్ఎస్ఎంబి28 మూవీలో బస్సులతో త్రివిక్రమ్ భారీ యాక్షన్ సీక్వెన్స్ ని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రామోజీ ఫిలింసిటీ లో దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతున్న ఈ భారీ యాక్షన్ ఫైట్ సీక్వెన్స్ లో సూపర్ స్టార్ మహేశ్ బాబు కొన్ని డేర్ డెవిల్ స్టంట్స్ చేసేందుకు సిద్దమవుతున్నారట. ఈ మూవీ కోసం త్రివిక్రమ్ అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేసుకున్నారని సమాచారం. ఈ మూవీ కోసం నిర్మాత ఎస్ రాధాకృష్ణ భారీగా ఖర్చు పెడుతున్నారు. ఈ చిత్రంలో పూజ హెగ్డే కథానాయిక కాగా థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మహర్షి తర్వాత పూజ హెగ్డే మహేశ్ జంట మరోసారి తెరపై సందడి చేయనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన థియేటర్లలో సందడి చేయనున్నట్లు తాజాగా నిర్మాతలు ప్రకటించారు.
మహేశ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ అయినా పోకిరి మూవీ కూడా ఏప్రిల్ ఇరవై ఎనిమిదినే విడుదల కావడం విశేషం. ఈ ఏడాది మే లో దర్శకుడు పరశురామ్ దర్శకత్వంలో మహేశ్ నటించిన సర్కారు వారి పాట ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరోవైపు మహేశ్ నిర్మాణ సారధ్యంలో అడవి శేష్ హీరోగా ‘మేజర్ ‘మూవీ పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ అయ్యింది. కాగా మహేశ్ త్రివిక్రమ్ జోడి ఇంతకు ముందు అతడు, ఖలేజా సినిమాలతో ప్రేక్షకులను అలరించారు.ముచ్చటగా మూడోసారి తెరపై ఎలాంటి అద్భుతాలు చేస్తారో వేచి చూడాల్సిందే .
End of Article