Ads
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భీమ్లా నాయక్ సినిమా గురించి ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకురావాలంటే చాలా విషయాలపై శ్రద్ధ పెట్టాలి.
Video Advertisement
డైరెక్షన్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ క్రమంలోనే ఈ సినిమా విషయమై త్రివిక్రమ్ కు కొన్ని బాధ్యతలు అప్పగించారు.
మలయాళ క్లాసికల్ హిట్ అయ్యప్పనుమ్ కోశియుమ్ కి ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. కానీ, ఇందులో పవన్ మేనరిజం కి తగ్గట్లు చాలానే మార్పులు చేస్తున్నారట. ఈ సినిమాకోసం త్రివిక్రమ్ కు ఏకంగా రూ. 15 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ను ఇస్తున్నారట. ఇది కాక.. లాభాల్లో కూడా కొంత పర్సెంటేజ్ ను ఇస్తున్నారట. సాధారణంగా త్రివిక్రమ్ డైరెక్టర్ గా చేసే సినిమాలకంటే ఎక్కువ మొత్తంలోనే ఈ సినిమా కోసం తీసుకుంటున్నారని ఫిలిం వర్గాల్లో టాక్.
End of Article