వైట్ హ్యాట్ జూనియర్ యాడ్ బ్యాన్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…పాపం చింటూ.!!

వైట్ హ్యాట్ జూనియర్ యాడ్ బ్యాన్ అవ్వడంపై ట్రెండ్ అవుతున్న ట్రోల్ల్స్…పాపం చింటూ.!!

by Mohana Priya

Ads

ఏదైనా ఒక ప్రాడక్ట్ అందరి దృష్టిని ఆకర్షించాలని అంటే అడ్వర్టైజింగ్ అనేది చాలా ముఖ్యం. దాన్ని ఎంత బాగా అడ్వర్టైజ్ చేస్తే దానిని కొనుక్కునే వారి సంఖ్య కూడా అంతే బాగా పెరుగుతుంది. ఇప్పుడు ఉదాహరణకి మన దగ్గర చాలా కంపెనీలు సబ్బులను ఉత్పత్తి చేస్తున్నాయి. కానీ ప్రతి ఒక్క కంపెనీ వాళ్ళ సబ్బు వేరే అని, ఇప్పటివరకు ఉన్న సబ్బులలో లేని స్పెషల్ క్వాలిటీ ఏదో వాళ్ల ప్రాడక్ట్ లో ఉంది అని చెప్తారు. దాంతో అది చూసిన జనాలు కూడా అసలు ఈ సబ్బు లో ఏముందో ఒకసారి తెలుసుకుందామనే ఆసక్తితో అయినా కొనుక్కుంటారు.

Video Advertisement

ఇది కేవలం ఉదాహరణ మాత్రమే. ఏదైనా ఒకటి ప్రజల్లోకి తీసుకెళ్లాలి అంటే ప్రచారం అవసరం. కానీ కొన్ని మాత్రం మిస్ లీడింగ్ గా ఉంటాయి. అవి చిన్నవైతే వదిలేయవచ్చు కానీ, జనాలను తప్పుదోవ పట్టించే లాగా ఉంటే మాత్రం ఇగ్నోర్ చేయడం కష్టమే. అలా ఇటీవల వైట్ హ్యాట్ జూనియర్ అనే కంపెనీ, ఒక అడ్వటైజ్మెంట్ విడుదల చేసింది. అందులో ఒక స్కూల్ పిల్లాడు కోడింగ్ నేర్చుకుని అప్లికేషన్ డెవలప్ చేశాడు అని చూపించారు.

అంతే కాకుండా ఆ పిల్లవాడి కోసం టాప్ కంపెనీలు వాళ్ల ఇంటి ముందు గొడవ చేస్తున్నట్లు చూపించారు. దాంతో చాలామందికి ఈ అడ్వటైజ్మెంట్ నచ్చలేదు. ఎందుకంటే ఇంజనీరింగ్ లో నాలుగేళ్లు కష్టపడినా కూడా ఒక్కొక్కసారి కోడింగ్ లో పర్ఫెక్ట్ అయ్యే అవకాశాలు లేవు. దాంతో సాఫ్ట్ వేర్ రంగంలోకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు కొంత మంది ఒక వేళ ఇంజినీరింగ్ లో కోడింగ్ గురించి పర్ఫెక్ట్ అవ్వకపోతే సపరేట్ గా కోచింగ్ క్లాస్ లో కోడింగ్ నేర్చుకుంటారు.

అంత కష్టపడి నేర్చుకునే కోడింగ్ ఇంత చిన్న వయసులో అంత సులభంగా నేర్చుకుంటారు అని చూపించడం కరెక్ట్ కాదు అని ఎంతో మంది నెటిజన్లు అన్నారు. నెటిజన్లు మాత్రమే కాకుండా అడ్వర్టైజ్మెంట్ చూసిన వాళ్లు కూడా ఈ విషయం గురించి అనుకునే ఉంటారు. దాంతో మిస్ లీడింగ్ గా ఉన్నాయి అని వైట్ హ్యాట్ జూనియర్ అడ్వర్టైజ్మెంట్స్ ని బ్యాన్ చేశారు. దీని పై సోషల్ మీడియాలో ఇలా ట్రోల్ల్స్ మొదలయ్యాయి.

#1

#2 #3 #4 #5


End of Article

You may also like