నిద్రపోతున్నావా బిగ్ బాస్? తెలుగు వాళ్ళు దొరకలేదా? అంటూ నెటిజెన్స్ ట్రోల్ల్స్.!

నిద్రపోతున్నావా బిగ్ బాస్? తెలుగు వాళ్ళు దొరకలేదా? అంటూ నెటిజెన్స్ ట్రోల్ల్స్.!

by Mohana Priya

బిగ్ బాస్ షో మనం ఎప్పటినుండో చూస్తున్న సెలబ్రిటీల నిజ జీవిత కోణాన్ని అందరికీ పరిచయం చేస్తుంది. అలా మనం స్క్రీన్ మీద అభిమానించిన ఎంతోమందిని స్క్రీన్ వెనకాల ఎలా ఉంటారో చూసి వాళ్లంటే కొంచెం చిరాకు పడ్డాం. అలాగే మనం స్క్రీన్ మీద చూసి చిరాకు పడిన ఎంతోమందిని స్క్రీన్ వెనకాల బిహేవియర్ చూసి అభిమానించాం.

Video Advertisement

ప్రస్తుతం వస్తున్న బిగ్ బాస్ సీజన్ ఫోర్ మొదలయ్యి కొద్దిరోజులు మాత్రమే అయింది కాబట్టి ఏ కంటెస్టెంట్ గురించి పూర్తిగా తెలియదు. అని కానీ కొంతమంది కంటెస్టెంట్స్ ప్రవర్తన వల్ల మాత్రం ఇప్పటికే ప్రజలు వాళ్ళని చూసి కొంచెం చిరాకు పడుతున్నారు. వాళ్లు ఎవరో మీకు కూడా ఇప్పటికే అర్ధమైపోయి ఉంటుంది. నామినేషన్స్ ఎపిసోడ్ లో సూర్య కిరణ్ ప్రవర్తించిన విధానం తో ప్రజలలో కొంచెం నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడింది.

అంతేకాకుండా కరాటే కళ్యాణి వేరే ఎవరికీ మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గట్టిగా అరిచి మాట్లాడటం, మోనాల్ గజ్జర్ కొంచెం తరచుగా ఎమోషనల్ అవ్వడం, ఇవన్నీ కూడా ప్రేక్షకుల సహనానికి పరీక్ష లాగా అనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రెండవ ఎపిసోడ్ లో సూర్య కిరణ్ ఒక తమిళ్ పాట పాడగా, అమ్మ రాజశేఖర్ కూడా సూర్య కిరణ్ తో గొంతు కలిపారు. దీనిపై సోషల్ మీడియాలో ఇది తెలుగు ప్రోగ్రామా? లేక వేరే భాష ప్రోగ్రామా? అని ట్రోల్ చేస్తున్నారు.

తర్వాత మోనాల్ గజ్జర్ కూడా ఒక సందర్భం లో హిందీలో మాట్లాడారు.  సాధారణంగా అయితే కంటెస్టెంట్స్ తెలుగు లో కాకుండా మరే ఇతర భాషలో అయినా మాట్లాడితే బిగ్ బాస్ వెంటనే తెలుగులో మాట్లాడాలి అని హెచ్చరిస్తారు.

కానీ ఎపిసోడ్ లో మాత్రం ఎటువంటి వార్నింగ్ ఇవ్వలేదు. బహుశా బిగ్ బాస్ కూడా ఇప్పుడే కదా వచ్చింది అని ఎక్స్క్యూజ్ చేశారేమో. లేదా వీకెండ్ లో కింగ్ నాగార్జున ఈ టాపిక్ గురించి మాట్లాడతారేమో.  చూద్దాం.


You may also like

Leave a Comment