చూస్తుండగానే బిగ్ బాస్ మొదలయ్యి రెండు నెలలు గడిచిపోయింది. ఇప్పుడు హౌస్ లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మిగిలారు. ఎలిమినేషన్ లో కూడా ఎవరు ఊహించని విధంగా కొంత మంది స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చేస్తున్నారు. గత ఎలిమినేషన్ లో మెహబూబ్ ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అఖిల్, సోహెల్, లాస్య, మోనాల్, అభిజిత్, అరియానా, హారిక, అవినాష్.

గత వారం వీకెండ్ ఎపిసోడ్ విషయానికి వస్తే, శనివారం దివాలి అవ్వడంతో ఎపిసోడ్ సరదాగా సాగింది. ఆదివారం ఎలిమినేషన్ లో భాగంగా మెహబూబ్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి రావడంతో ఎపిసోడ్ చాలా ఎమోషనల్ గా నడిచింది. ఇంక ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ సోమవారం ఎపిసోడ్ లో జరిగింది. నామినేషన్ లో భాగంగా ఒక కంటెస్టెంట్ ని నామినేట్ చేయడానికి మరొక కంటెస్టెంట్ చెప్పిన కారణాల వల్ల మొదలైన చర్చ, ఆర్గ్యుమెంట్స్ కి దారి తీసింది.

సోహెల్, హారికని నామినేట్ చేసి వీకెండ్ ఎపిసోడ్ లో హారిక, సోహెల్ ని చిచ్చుబుడ్డి తో పోల్చి, ఎందుకు పోల్చిందో చెప్పిన కారణం వల్ల తను హర్ట్ అయ్యాను అని చెప్పారు. అప్పుడు ఇద్దరి మధ్య చాలా సేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. కెప్టెన్ స్థానంలో ఉన్న అఖిల్, అభిజిత్ ని నామినేట్ చేసి హౌస్ లో నుండి బయటికి వెళ్ళినప్పుడు అభిజిత్ తన గురించి మాట్లాడారు అని, హౌస్ నుండి వెళ్లిపోయినందుకు బాధపడకపోయినా పర్లేదు కానీ, అలా మాట్లాడటం తప్పు అని అన్నారు అఖిల్.

ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి చాలాసేపు చర్చ జరిగింది. సోహెల్ ని నామినేట్ చేసిన అభిజిత్, మాట్లాడే విధానం మార్చుకోమని చెప్పారు. ఇక్కడ కూడా కొంచెం సేపు డిస్కషన్ జరిగింది. దాంతో సోమవారం ఎపిసోడ్ కొంచెం సీరియస్ గానే నడిచింది. బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్స్ పై ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2 #3 #4 #5 #6 #7 #8  #9 #10 #11 #12 #13 #14 #15 #16 #17 #18 #19 #20


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com