Ads
మాస్ మహారాజ్ రవితేజ సినిమా “క్రాక్” కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న వేళ ఈ సినిమా యూనిట్ బాడ్ న్యూస్ చెప్పింది. ఈ రోజు (జనవరి 9 ) న ఈ సినిమా విడుదల కావాల్సి ఉంది. కానీ ఈ సినిమా విడుదల వాయిదా పడింది. అసలు మొదటినుంచి క్రాక్ సినిమా విడుదల పై కన్ఫ్యూజన్ నెలకొంది. అసలే కరోనా గడ్డు కాలం లేక సినిమా థియేటర్లలో సినిమాలు లేక సినీ అభిమానులు ఎపుడు మంచి మాస్ మసాలా సినిమా వస్తుందా అని ఆశగా ఎదురుచూసారు. అనుకున్నట్లే..మాస్ విందు భోజనం వడ్డించేయడానికి “క్రాక్” రెడీ అయింది.
Video Advertisement
ఈ సినిమా పై భారీ గానే అంచనాలు పెట్టేసుకున్నారు. ఈ సినిమా లో శృతి హాసన్ హీరోయిన్ కావడం, గతం లో హిట్ అయిన బలుపు కాంబినేషన్ రిపీట్ అవడం తో ఈ సినిమా రవితేజ కి మంచి హిట్ ఇస్తుందని ఆశించారు. కానీ, అసలు సినిమా నే రిలీజ్ కాకపోవడంతో నిరాశ గా థియేటర్ల నుంచి వెనుదిరగాల్సి వచ్చింది. మొదట ఫస్ట్ డే ఫస్ట్ షో, మార్నింగ్ షో లు మాత్రం కాన్సల్ అయ్యాయని, మాట్నీ షో వస్తుందని ఆశించారు.
ఆ తరువాత ఇది కూడా కాన్సల్ అయింది. ఫైనాన్షియల్ ఇష్యుస్ ను క్లియర్ చేయాల్సి ఉండడం వలన, సినిమా విడుదల ఆలస్యమైనట్లు తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రానికైనా విడుదల అవ్వొచ్చని భావించారు. కానీ, ఈ సినిమా విడుదల మొత్తానికే వాయిదా పడిందని తెలుస్తోంది. ఈ సినిమా విడుదల వాయిదా పడడం తో సోషల్ మీడియా లో మీమర్స్ దొరికిందే ఛాన్స్ అన్నట్లు గా జోక్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిల్లో, కొన్ని మీకోసం ఇక్కడ ఇస్తున్నాం. మీరు కూడా చూసి నవ్వుకోండి..
1.
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11.
12.
End of Article