జెనీలియాని మరిచిపోయినందుకు విష్ణుపై వచ్చిన ట్రోల్ల్స్ ఇవే..! ఇంతకీ ఏమైందో చూస్తే నవ్వాపుకోలేరు.!

జెనీలియాని మరిచిపోయినందుకు విష్ణుపై వచ్చిన ట్రోల్ల్స్ ఇవే..! ఇంతకీ ఏమైందో చూస్తే నవ్వాపుకోలేరు.!

by Megha Varna

Ads

తెలుగు వారు ఎప్పటికి గుర్తించుకునే హాస్యభరితమైన చిత్రాలలో శ్రీను వైట్ల చిత్రాలు ఉంటాయి అనడంలో అతిశయోక్తి లేదు . అయన దర్శకత్వం వహించిన వెంకీ ,ఆనంద్ ,సొంతం ,ఢీ సినిమాలు ఇప్పటికి ప్రేక్షకులను నవ్విస్తూనే ఉన్నాయి.కామెడీలో తనకంటూ ఓ ట్రేడ్ మార్క్ ను క్రియేట్ చేసుకున్నారు శ్రీను వైట్ల .కాగా ఢీ చిత్రం విడుదల అయ్యి నేటికీ పదమూడు సవంత్సరాలు అయింది.ఈ సందర్భంగా శ్రీను వైట్ల మాట్లాడుతూ ఈ చిత్రం నాకు ఎంతో ప్రత్యేకమైంది అని… ఈ చిత్రం షూటింగ్ ప్రతిరోజు ఒక ఛాలెంజింగ్ గా ఉండేదని అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ నిర్మాత ఎంఎస్ రెడ్డి కి కృతఙ్ఞతలు తెలిపారు ..

Video Advertisement

కాగా ఢీ చిత్రంలో మంచు విష్ణు ,జెనీలియా జంటగా నటించగా విష్ణు కెరీర్లోనే ఈ చిత్రం పెద్ద హిట్ గా నిలిచింది .ఈ చిత్రంలో బ్రహ్మానందం ,సునీల్ ,విష్ణు ల మధ్య వచ్చే సీన్లు నేటికీ హైలైట్గా నిలిచాయి .తర్వాత ఈ చిత్రాన్ని తమిళ్ లో మిరటాల్ గా ,బెంగాలీ లో ఖోకబాబు గా నిర్మించగా అక్కడ కూడా ఈ చిత్రం బారి విజయాన్ని నమోదు చేసుకుంది .

ఈ సందర్భంగా  విష్ణు ట్విట్టర్ వేదికగా ఇలా పోస్ట్ చేసారు .”ఢీ చిత్రం విడుదల అయ్యి నేటికి 13 సవంత్సరాలు పూర్తి చేసుకుంది .ఆనందబాష్పాలు అనే మాటకు నాకు అర్ధం తెలిసిన రోజు .నా తండ్రి మోహన్ బాబు వలనే ఇది సాధ్యపడింది .ఆయన లేకపోతే ఇది జరిగేది కాదు .అందుకోసం నా మొదటి కృతఙ్ఞతలు ఆయనకే .ఇలాంటి మంచి యాక్షన్ కామెడీ చిత్రాన్ని నాకు ఇచ్చిన నా బ్రదర్ శ్రీను వైట్లకు కృతఙ్ఞతలు అని తెలిపారు .

దీనిపై జెనీలియా రిప్లై ఇస్తూ ఈ చిత్రంలో నేను కూడా ఉన్నానని నీకు గుర్తుందా అని రాసారు .దానికి విష్ణు స్పందిస్తూ “నువ్వు నేను పోస్ట్ చేసిన ఫోటో చూడలేదా అందులో నువ్వు ఉన్నావ్ .నిన్ను ఎప్పటికి మర్చిపోలేను అని అన్నారు ..కాగా ఈ విషయంపై సోషల్ మీడియాలో పలు  ట్రోల్స్ హల్చల్ చేస్తున్నాయి .

జెనీలియా విష్ణు ట్విట్టర్ సంభాషణ పై ఒకరు ఇలా ట్రోల్ చేసారు .’మర్చిపోయిన దానిని ఈ రేంజ్ లో కవరింగ్ చేయడం అంటే.. మీరు ఒక వర్గానికి ఇన్స్పిరేషన్ సర్’ అంటూ ఎడిట్ చేసారు .దీనికి అదుర్స్ చిత్రంలో బ్రహ్మానందం ఎన్టీఆర్ మాట్లాడుకుంటున్న చిత్రంతో ‘ఇంక లాగకండి తెగుద్ది ‘ అని విష్ణు ని అంటునట్లుగా ట్రోల్ చేసారు .కాగా విష్ణు జెనీలియా ను ట్వీట్ లో మర్చిపోవడం దానికి విష్ణు చేసిన కవరింగ్ వాటిపై వచ్చిన ట్రోల్స్  నెటిజన్లను విపరీతంగా నవ్విస్తున్నాయి ..

 

 

 

 

 

 

 


End of Article

You may also like