మూడు నెలలు అలా గడిచిపోయాయి. అప్పుడే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 రావడం, అయిపోవడం కూడా జరిగిపోయింది. అసలు ఈ షోకి ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. మనలో చాలా మంది బిగ్ బాస్ చూస్తాం. కొంత మంది ఆసక్తితో చూస్తే, కొంత మంది టైంపాస్ కి చూస్తారు. ఇంకా కొంతమంది “అసలు ఈ షోలో ఏముంది?” అనే క్యూరియాసిటీతో చూస్తారు. ఎలాగైనా సరే, షో చూసే ప్రేక్షకుల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంటుంది.

దీని ఫలితంగా టిఆర్పి కూడా ఛానల్ కి కావాల్సినంత వస్తుంది. ఇంక  ఫైనల్స్ విషయానికొస్తే మెహరీన్, అనిల్ రావిపూడి, రాయి లక్ష్మి గెస్ట్ లుగా వచ్చారు. సంగీత దర్శకుడు తమన్ తన బృందంతో కలిసి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. టాప్ ఫిఫ్త్ కంటెస్టెంట్ గా హారిక, టాప్ ఫోర్త్ కంటెస్టెంట్ గా అరియానా, బిగ్ బాస్ తనకి ఇచ్చిన ఆఫర్ తీసుకొని టాప్ థర్డ్ కంటెస్టెంట్ గా సోహెల్ నిలిచారు. విజేతకి టైటిల్ ప్రెజెంట్ చేయడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వచ్చారు.

అలాగే తను మెహర్ రమేష్ దర్శకత్వంలో వేదాళం రీమేక్ చేయబోతున్నట్టు, అందులో ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రకి దివిని తీసుకోమని మెహర్ రమేష్ కి చెప్పినట్టు, ఒక ఎనిమిది, తొమ్మిది నెలల్లో చిరంజీవి, దివి కలిసి పనిచేసే అవకాశం రావచ్చు అని చెప్పారు. టాప్ టులో అఖిల్, అభిజిత్ మిగలగా, అభిజిత్ విజేతగా నిలిచారు. అఖిల్ రన్నరప్ అయ్యారు. చిరంజీవి అలా తన రాబోయే సినిమా గురించి అప్డేట్ ఇవ్వడంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కొన్ని మీమ్స్ ఇవే.

#1

#2

#3

#4

#5

#6

#7

#8

#9

#10

#11

#12

#13

#14

#15

#16

#17