Ads
ఆసీస్‌తో అడిలైడ్ లో జరుగుతున్న తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలోనే వికెట్ కోల్పోయింది. ఓపెనర్ పృథ్వీ షా తొలి ఓవర్ రెండో బంతికే మిచెల్ స్టార్క్ బౌలింగ్‌లో డకౌట్ ఆయాయ్రు. పృథ్వీ షా డకౌట్‌గా వెనుదిరగడంపై సోషల్ మీడియాలో చాలా ట్రోల్ల్స్ వస్తున్నాయి. స్టార్క్ వేసిన బంతికి…డిఫెన్స్ చేయబోయి కట్ అండ్ బౌల్డ్‌గా వెనుదిరిగాడు షా.
Video Advertisement
పృథ్వీ షాకు అవకాశాలు ఎందుకిస్తారో అర్థం కావడం లేదు అంటూ కొందరు నెటిజెన్స్. గిల్ లేదా రాహుల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేది అని మరికొందరు ట్రోల్ల్స్ చేస్తున్నారు. ఐపీఎల్ లో ప్రిథ్వి షా ఫెయిల్ అయిన సంగతి అందరికి తెలిసిందే. తొలి మ్యాచ్‌కు ఒకరోజు ముందు ప్రకటించిన తుది జట్టులో గిల్ ఉంటాడని అంతా భావించారు. కానీ తుది జట్టులో గిల్ స్థానంలో షా కు అవకాశం ఇచ్చారు. ప్రస్తుతం టీం ఇండియా 18 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 32 పరుగులు చేసింది.
End of Article