Home Sports Adda “సండే రోజు లీవ్ ఎందుకు..?” రాజస్థాన్ రాయల్స్ కి క్రేజీ కౌంటర్.!

“సండే రోజు లీవ్ ఎందుకు..?” రాజస్థాన్ రాయల్స్ కి క్రేజీ కౌంటర్.!

by Mohana Priya

మన దేశంలో ఐపీఎల్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఒక్కసారి ఐపీఎల్ సీజన్ మొదలైతే మిగిలిన షోస్ అన్ని ఒక వైపు, ఐపీఎల్ ఇంకొకవైపు అన్నట్టు ఉంటుంది. చాలా ఇళ్లలో ఐపీఎల్ కోసం బానే డిస్కషన్స్ జరుగుతాయి. అయితే ఈసారి ఐపీఎల్ అర్ధాంతరంగా ఆగిపోయిన సంగతి మనందరికీ తెలిసిందే. అందుకు కారణం కరోనా కేసులు పెరగడమే.

rajasthan royals tweet

అయితే సెప్టెంబర్ లో ఐపీఎల్ మొదలవబోతోంది అనే సంగతి మనందరికీ తెలిసిందే. దాంతో ప్రేక్షకులు అందరూ ఎప్పుడు ఎప్పుడు ఐపీఎల్ మొదలవుతుందా అని ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఐపీఎల్ జట్ల లో సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉండే జట్టు రాజస్థాన్ రాయల్స్. అయితే రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్ నుండి ఒక ట్వీట్ చేశారు.

rajasthan royals tweet

అక్టోబర్ 24వ తేదీ రోజు లీవ్ కావాలి అని కోరుతున్నట్టు ఆ ట్వీట్ యొక్క సారాంశం. ఆరోజు ఇండియా పాకిస్తాన్ టి20 వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది. కానీ ఒకసారి గమనిస్తే ఆ రోజు ఆదివారం. దాంతో ఆదివారం రోజు లీవు అడగడం ఏంటి అని రాజస్థాన్ రాయల్స్ ట్విట్టర్ అకౌంట్ పై సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.

You may also like