ఉమేష్ అన్న బౌలింగ్ మరోసారి ట్రెండ్ అవుతున్న 25 ట్రోల్ల్స్…కొత్తగా స్టెయిన్ కూడా దిండా అకాడమీలో.!

ఉమేష్ అన్న బౌలింగ్ మరోసారి ట్రెండ్ అవుతున్న 25 ట్రోల్ల్స్…కొత్తగా స్టెయిన్ కూడా దిండా అకాడమీలో.!

by Megha Varna

Ads

ఐపీఎల్ 2020 లో భాగంగా సెప్టెంబర్ 24వ తేదీన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కి కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు కి మధ్య జరిగిన మ్యాచ్ లో 97 పరుగుల తేడాతో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ టీం విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ జట్టు 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. టాస్ గెలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నారు. మయాంక్ అగర్వాల్‌ (26: 20 బంతుల్లో 4×4) స్కోర్ చేశారు. జట్టు స్కోరు 57 ఉన్నప్పుడు మయాంక్ అగర్వాల్ అవుటయ్యారు. నికోలస్ పూరన్ (17: 18 బంతుల్లో 1×4), గ్లెన్ మాక్స్‌వెల్ (5: 6 బంతుల్లో) స్కోర్ చేశారు.

Video Advertisement

కేఎల్ రాహుల్ (132 నాటౌట్: 69 బంతుల్లో 14×4, 7×6) చేశారు. తర్వాత రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు లో వాషింగ్టన్ సుందర్ (30: 27 బంతుల్లో 2×4, 1×6), ఏబీ డివిలియర్స్ (28: 18 బంతుల్లో 4×4, 1×6), అరోన్ ఫించ్ (20: 21 బంతుల్లో 3×4) స్కోర్ చేశారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (1), ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చిన జోస్ ఫిలిప్పీన్ (0) చేశారు. అరోన్ ఫించ్, ఏబీ డివిలియర్స్ కాసేపు క్రీజులో నిలిచి నాలుగో వికెట్‌కి 49 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.

ఆ తర్వాత శివమ్ దూబే (12), ఉమేశ్ యాదవ్ (0), నవదీప్ సైనీ (6), చాహల్ (1) స్కోర్ చేశారు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు బౌలర్లలో రవి బిష్ణోయ్ మూడు వికెట్లు, మురగన్ అశ్విన్ మూడు వికెట్లు, కాట్రెల్ రెండు వికెట్లు, షమీ ఒక వికెట్, మాక్స్‌వెల్ ఒక వికెట్ తీశారు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టు 17 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌట్ అయ్యింది.

అయితే ఈ మ్యాచ్ లో ఉమేష్ యాదవ్ ఆడిన తీరు అందరినీ డిసప్పాయింట్ చేసింది. దాంతో ఉమేష్ యాదవ్ బాయ్ సరిగా డెలివర్ చేయకపోవడంపై సోషల్ మీడియా లో నెటిజన్లు తమ ఫ్రస్టేషన్ ని వ్యక్తం చేశారు. మీ మీమ్ పేజెస్ కూడా ఉమేష్ యాదవ్ తో పాటు, డేల్ స్టెయిన్ పై మీమ్స్ వేయడం మొదలుపెట్టారు.

#1

#2#3#4
#5#6#7#8#9#10#11#12#13#14#15#16#17#18#19#20#21#22#23#25#26#27

#28

#29


End of Article

You may also like