Ads
కుక్క విశ్వాసం గురించి మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. అన్నం పెట్టిన యజమాని కోసం అవి కొన్ని సందర్భాల్లో వాటి ప్రాణాలు కూడా ఇచ్చేదుకు వెనుకాడవు. ఒక్క పూట అన్నం పెట్టినందుకు అవి జీవితకాలం విశ్వాసంగా ఉంటాయి. ఈ నేపథ్యం లో ఒక కుక్క చూపిన విశ్వాసం ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
Video Advertisement
కరోనా లాక్ డౌన్ సమయం లో పిడికెడు ముద్ద దొరక్క వీధి కుక్కలు అల్లాడి పోయాయి. జన జీవనం స్తంభించడంతో వీటికి ఆహారం ఇచ్చే నాథుడే కరువయ్యాడు. దీంతో వీటిని సంరక్షించేందుకు చాలా మంది ముందుకు వచ్చారు.ఈ క్రమంలోనే ఒక యువతి ఓ వీధి కుక్కకు అన్నం పెట్టింది. కానీ రెండేళ్ల తర్వాత కూడా ఆ కుక్క ఆమెను గుర్తుపట్టడం తో ఆమె ఆ వీడియో ని సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో ఆ వీడియో వైరల్ అయిపొయింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబయి నగరానికి చెందిన ప్రియాంక చౌబల్ అనే యువతి వీధి కుక్కలు, పిల్లులు వంటి వాటికీ సహాయం చేస్తూ ఉంటారు. ఆమె కరోనా లాక్‌డౌన్ సమయంలో ఓ వీధి కుక్కకు అన్నం పెట్టింది. తర్వాత ప్రియాంక తాజాగా ఒకరోజు ఆఫీసుకు వెళ్లేందుకు బస్సు స్టాప్ కు వచ్చింది. బస్సు వెళ్లిపోవడంతో సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయానికి వెళ్ళింది. అప్పుడు అక్కడ లాక్డౌన్ సమయంలో తాను ఆహారం పెట్టిన వీధి కుక్క ప్రియాంకకు ఎదురైంది.
లాక్ డౌన్ అనంతరం చాన్నాళ్ల తర్వాత కుక్క కనిపించినా అది తనను గుర్తించిందని ప్రియాంక వీడియోను ఇన్‌స్టాగ్రాంలో పోస్టు చేశారు. ఆ వీడియో, ఫొటోల్లో వీధికుక్క ఆరాధ్య కళ్లతో తనకు అన్నం పెట్టిన ప్రియాంక వైపు చూసి తోక ఊపడం కనిపించింది.
దాని విశ్వాసానికి ఆ యువతి ఒక్కసారిగా ఫిదా అయిపోయింది.ఒక్కసారి ఫుడ్ పెట్టిన కుక్కకి ఎంత విశ్వాసం ఉంటుందో చూడండి అంటూ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక వీడియో పోస్ట్ పెట్టింది. ఆ పోస్ట్ కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. ప్రియాంక చౌబల్ పెట్టిన ఈ క్లిప్ స్ట్రే డాగ్ ఫీడర్ అంధేరి అనే పేజీలో షేర్ చేశారు. వీధి కుక్క విశ్వాసంపై ప్రియాంక పెట్టిన ఇన్‌స్టాగ్రాంలో పోస్టుకు నెటిజన్ల నుంచి లైక్‌లు వచ్చాయి.
watch video:
https://www.instagram.com/p/CjEvucmKdN_/
End of Article