Ads
రెబల్ స్టార్ ప్రభాస్ శ్రీ రాముడిగా నటించిన పౌరాణిక చిత్రం ఆదిపురూష్. ఈ సినిమాని బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ తెరకెక్కించాడు. ఈ సినిమాలో సీతగా బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ నటించగా, రావణాసురుడుగా సైఫ్ అలీఖాన్ నటించారు.
Video Advertisement
ఈ చిత్రం 5 వందల కోట్ల బడ్జెట్ తో, భారీ గ్రాఫిక్స్ తో భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదల అయ్యింది. తొలి షోతోనే విమర్శలు, వివాదాలకు కేంద్రబిందువుగా మారింది. బాక్సాఫీస్ దగ్గర ప్లాప్ గా నిలిచింది. సోషల్ మీడియాలో దర్శకుడిని, రచయితను దారుణంగా ట్రోల్ చేశారు. ఆదిపురుష్ సినిమా జూన్ 16న ఆడియెన్స్ ముందుకు వచ్చింది. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడియెన్స్ ను ఆకట్టుకోలేక పోయింది. ఆడియెన్స్ తో పాటు, ప్రభాస్ ఫ్యాన్స్, సినీ, రాజకీయ ప్రముఖులు సైతం దర్శకుడు ఓం రౌత్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. విమర్శలు, వివాదాలు, కోర్టులో కేసులు వేసే వరకు వెళ్ళింది. రామాయణంను మార్చి చూపించారని, రావణాసురుడి క్యారెక్టర్ ను తప్పుగా చూపించారని, హనుమంతుడితో మాస డైలాగ్స్ చెప్పించారని, పేర్లు మార్చారని ఇలా ఎన్నోవివాదాలు వచ్చాయి. తాజాగా కోరాలో “ఆది పురుష్ సినిమాలో లక్ష్మణుడిపేరు శేషు అని పెట్టారు. దీని గురించి వివరించగలరా?” అనే ప్రశ్నను అడుగగా ఈగల్ కింగ్ అనే యూజర్ ఇలా సమాధానం చెప్పుకొచ్చాడు. “శ్రీ మహా విష్ణువు – శ్రీ రామునిగా అవతారం ఎత్తాడు. అదే విధంగా ఆయన వైకుంఠంలో పడుకునేది పాము మీద పాముని శేషు అని కూడా అంటారు. ఆ పామే లక్ష్మణునిగా జన్మించింది. అందుకే ఈ సినిమాలో లక్ష్మణుని పూర్వ జన్మ పేరుతో శేషు అని పిలిచాడు రాముడు. ఇంకా మహావిష్ణువు యొక్క శంకు, చక్రాలు – భరత, శతృఘ్నులుగా, ఆయన సతీదేవి అయినటువంటి మహాలక్ష్మి దేవి సీతగా జన్మించారు” అని తెలిపారు.
End of Article