“ఏంటి మేడం..? మీరు ఇలా అడుగుతున్నారు..?” అంటూ… నటి “తులసి” పై కామెంట్స్..! విషయం ఏంటంటే..?

“ఏంటి మేడం..? మీరు ఇలా అడుగుతున్నారు..?” అంటూ… నటి “తులసి” పై కామెంట్స్..! విషయం ఏంటంటే..?

by kavitha

Ads

సీనియర్ నటి తులసి తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఒకప్పుడు హీరోయిన్ గా రాణించిన తులసి, సెకండ్ ఇన్నింగ్స్ లో టాప్ హీరోల చిత్రాలలో  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నారు.

Video Advertisement

ఇక ఇప్పటి స్టార్ హీరోలకు అమ్మ క్యారెక్టర్ లో నటిస్తూ, తెలుగు ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ప్రభాస్ కు మదర్ గా డార్లింగ్ సినిమాలో తులసి చేసిన పాత్రకు ఎంత గుర్తింపు వచ్చిందో తెలిసిందే. అయితే తాజాగా హీరో నాని పెట్టిన ఇన్ స్టా పోస్ట్ కు సీనియర్ నటి తులసి కామెంట్ చేసింది. దీని పై నెటిజెన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
నటి తులసి బాలనటిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆమె తల్లి, సావిత్రి, అంజలి దేవిలకు స్నేహితురాలు. వారు తరచూ తులసి ఇన్డీటికి వస్తుండేవారు. ఆ క్రమంలో తులసికి బాలనటిగా అవకాశం వచ్చింది. ఆమె చాలా సినిమాలలో బాలనటిగా నటించారు. శంకారాభరణం సినిమాతో తులసి మంచి గురింపు వచ్చింది.  జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన ముద్ద మందారం మూవీతో హీరోయిన్ గా మారింది. ఆ తర్వాత నాలుగు స్థంబాలాట, శుభలేఖ, మంత్రిగారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు వంటి సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా నటించింది.
శుఖలేఖ మూవీ సూపర్ హిట్ అయ్యి, శుభలేఖ సుధాకర్, తులసిల పెయిర్ కు మంచి పేరు వచ్చింది. దాంతో అదే తరహాలో తులసికి వరుస అవకాశాలు వచ్చాయి. అలా సూపర్ స్టార్ కృష్ణ, కృష్ణం రాజు, శోభన్ బాబు, మురళీమోహన్, చంద్రమోహన్, రాజేంద్రప్రసాద్ వంటి హీరోల సినిమాలలో నటించి ఆకట్టుకున్నారు. ఆమె తెలుగులో మాత్రమే  కాకుండా మలయాళ, తమిళ చిత్రాలలో కూడా నటించారు. పెళ్లి చేసుకున్న తరువాత సినిమాలకు దూరం అయ్యారు.
2010 లో ప్రభాస్ హీరోగా నటించిన డార్లింగ్ మూవీతో రీఎంట్రీ ఇచ్చిన తులసి, స్టార్ హీరోలకు తల్లి పాత్రలూ చేస్తూ, బిజీ బిజీగా ఉన్నారు. తులసి కెరీర్ లో దాదాపు 700 పైగా చిత్రాలలో నటించారు. తాజాగా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లు పూర్తయ్యాయి అని హీరో నాని పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ కి నటి తులసి కామెంట్ సెక్షన్ లో “నాని నేను నటి తులసి (నేను లోకల్) నన్ను మీ తల్లిగా భావించి, మీలాంటి అద్భుతమైన నటుడితో కలిసి పనిచేసే అవకాశం ఇవ్వండి” అని రాసుకొచ్చింది. తులసి అలా ఆడగడంతో కొందరు ఆమెని పొగుడ్తున్నారు. కానీ కొందరు మీరు ఇలా అడగడం ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు.

https://www.instagram.com/p/CwzAqY-Rx5N/?igshid=NjZiM2M3MzIxNA%3D%3D

Also Read: MARK ANTONY REVIEW : “విశాల్, SJ సూర్య” కి ఈ సినిమాతో హిట్ పడినట్టేనా..? స్టోరీ, రివ్యూ & రేటింగ్.!


End of Article

You may also like