Ads
సీరియల్ నటి లహరి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఎన్నో హిట్ సీరియల్స్ లో నటించింది. ఎంతో సంప్రదాయబద్ధంగా కనిపిస్తూ తన నటనతో ప్రేక్షకులని కట్టి పడేస్తూ ఉంటుంది. అయితే.. తాజాగా ఆమెను పోలీసులు అరెస్ట్ చేసారు.
Video Advertisement
ఆమె మద్యం మత్తులో నడపడం వల్లనే ఇలా జరిగిందని పలు వార్తా కధనాలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఈ వార్తా చర్చనీయాంశం అయింది.
న్యూస్ 18 కధనం ప్రకారం.. హైదరాబాదు శివారు శంషాబాద్ ప్రాంతంలో ఆమె మద్యం మత్తులో ఉండగా కారు డ్రైవ్ చేస్తూ వచ్చింది. ఆ ప్రాంతంలోనే ఆక్సిడెంట్ కూడా జరిగింది. కారుని తానే డ్రైవ్ చేస్తూ వెళ్లిన లహరి ఎదురుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తిని ఢీ కొట్టింది. ఈ ఆక్సిడెంట్ వలన ఎదురుగా బైక్ పై వెళ్తున్న వ్యక్తికీ తీవ్రంగా గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ కు ఫోన్ చేసారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు.
ఈ ఆక్సిడెంట్ వలన లహరి చాలా భయబ్రాంతులకు గురి అయ్యారు. బయట ఎక్కువగా జనాలు గుమిగూడి ఉండడంతో ఆమె కారులోపలే ఉండిపోయారు. దీనితో పోలీసులు కార్ తో సహా పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. ఆమె మద్యం సేవించారేమో అన్న అనుమానంతో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేసారు. అయితే ఆమెకు క్లీన్ చిట్ వచ్చిందా లేదా అన్నది మాత్రం తెలియరాలేదు.
అయితే.. గాయపడిన వ్యక్తి ఆమె పై ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడంతో.. ప్రాధమికంగా ఆమెను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ పై సంతకం చేయించి ఇంటికి పంపించేశారు. బాలనటి గా “అర్జున్” సినిమాలో కనిపించిన నటి లహరి “చక్రవాకం” సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఆ తరువాత పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల మెప్పు పొందారు.
End of Article