అక్క పెళ్లికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న డబ్బులతో…ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టిన అక్కాచెల్లెళ్లు.!

అక్క పెళ్లికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న డబ్బులతో…ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టిన అక్కాచెల్లెళ్లు.!

by Mohana Priya

Ads

కొంత మందికి ఎదుటి వారికి సహాయం చేయాలి అని అనిపిస్తుంది కానీ ఆ సమయంలో వారి దగ్గర అవతలి వారికి సహాయం చేసే అంత డబ్బు ఉండకపోవచ్చు. కొంత మంది దగ్గర డబ్బులు ఉండొచ్చు కానీ వారికి వేరే వారికి సహాయం చేయాలి అనే ఆలోచన రాకపోవచ్చు. తమ దగ్గర డబ్బులు ఉండి వేరే వారికి సహాయం చేసే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు.

Video Advertisement

two sisters helped a woman

వారిలో ఈ అక్క చెల్లెలు కూడా ఒకరు. వివరాల్లోకి వెళితే. శృతి అనిత అక్క చెల్లెలు. ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని చిత్తూరు లోని తిరుపతికి చెందిన వాళ్లు. వారిద్దరూ యుఎస్ లో మెడిసిన్ చదువుతున్నారు. వారు వారి అక్క సంధ్య పెళ్లి కోసం ఇండియాకి తిరిగి వచ్చారు. వారి దగ్గర ఉన్న 15 వేలతో వాళ్ళకి బంగారు ఆభరణం ఏమైనా గిఫ్ట్ గా కొనుక్కొని వెళ్దాం అనుకున్నారు.

two sisters helped a woman

అయితే వారిద్దరూ ఫేస్ బుక్ లో రమేష్ అనే ఒక వ్యక్తి పెట్టిన పోస్ట్ చూసారు. అందులో కరీంనగర్ జిల్లా ధర్మపురి లోని న్యూ ఎస్సీ కాలనీకి చెందిన బత్తిని  అంజవ్వ ఒక ఆవిడ గురించి చెప్పారు రమేష్. అంజమ్మ తండ్రి చిన్నతనంలో చనిపోయారు. తర్వాత తనకి వివాహమైన ఏడాదిలోపే భర్తతో విడాకులు అయ్యాయి. కొంత కాలం నుండి అంజవ్వ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.

two sisters helped a woman

అందుకు వైద్యం చేయించుకోవడానికి అంజవ్వ దగ్గర తగిన డబ్బు లేదు. దాంతో అంజవ్వ కి సహాయం చేయాలి అని ఆ పోస్టు ద్వారా తెలియజేశారు. ఈ పోస్ట్ చూసిన అనిత శృతి మా అక్క కి గిఫ్ట్ తీసుకోవడానికి వారి దగ్గర ఉన్న 15 వేల రూపాయలను ఇచ్చారు. దాంతో అంజవ్వ వీరిద్దరిని ఎంతో పొగిడారు. అలా ఈ అక్క చెల్లెళ్ళు ఇద్దరూ మానవత్వానికి ఒక ఉదాహరణగా నిలిచారు.


End of Article

You may also like