ఆహా లో నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ షో కి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా మంది సెలెబ్రెటీస్ వచ్చారు. ఇప్పుడు ఈ షో సెకండ్ సీజన్ అవుతోంది. ఈ షో కి చాలా మంది టాలీవుడ్ సెలెబ్రిటీలు వచ్చారు. వాళ్ళతో హోస్ట్ అయిన బాలయ్య ఎన్నో మాట్లాడారు.

Video Advertisement

ఇదిలా ఉంటే త్వరలో ప్రభాస్ ఈ షో కి వస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 11న ప్రభాస్ తన ఫ్రెండ్ హీరో గోపీచంద్‌ తో ఈ షో కి వస్తున్నాడట.

బాలయ్య తో వీళ్లిద్దరు సందడి చేయనున్నారు. ఈ షో న్యూ ఇయర్ నాడు ప్రసారం చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ గోపి చంద్ ఇద్దరు వర్షం సినిమా చేసారు. విలన్ గా గోపి చంద్ చక్కటి యాక్టింగ్ చేసారు. వర్షం సినిమా తర్వాత గోపీచంద్ మరియు ప్రభాస్ ఇద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉన్నారు. చాలా సందర్భాలలో ప్రభాస్ తో ఉన్న స్నేహం గురించి గోపీచంద్ చెబుతూనే వచ్చారు. ఈ షోలో కూడా వాళ్ళిద్దరూ స్నేహం గురించి చెబుతారు ఏమో అనేది చూడాల్సి ఉంది. పైగా బాలయ్య కూడా ప్రభాస్, గోపీచంద్ తో మాట్లాడతారు కాబట్టి మంచిగా ఎంటర్టైన్మెంట్ తో షో ఉండనుంది.

ఇంత గొప్ప ఎంటర్టైన్మెంట్ ని వీళ్ళ ముగ్గురు ఇస్తారు కాబట్టి కొత్త సంవత్సరానికి కానుకగా షో వస్తుందేమో అనేది చూడాల్సి ఉంది. గోపీచంద్ తొలివలపు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జయం, వర్షం సినిమాలు మంచి పేరును తీసుకు వచ్చాయి. తర్వాత చాణక్య, సిటీ మార్ ఇలా చాలా సినిమాల్లో గోపీచంద్ నటించారు. ప్రభాస్ క్రేజ్ బాహుబలి తో మాములుగా లేదు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా హీరోగా ఎదిగిపోయారు. ప్రభాస్ చేతి లో ప్రస్తుతం నాలుగు మూవీస్ వున్నాయి. ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్ కె సినిమాలతో ప్రభాస్ బిజీగా వున్నారు. అలానే మారుతి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నారు. ఇక బాలయ్య షో విషయానికి వస్తే.. డిసెంబరు 2న జరిగే ఎపిసోడ్ కి రాఘవేంద్రరావు, అల్లు అరవింద్, సురేష్ బాబు రానున్నారు. రాత్రి 9 గంటలకి ఈ ఎపిసోడ్ ఆహా లో వస్తుంది.