Ads
యాంకర్ గా ఉదయభాను కు మంచి పేరు ఉంది. సుమ కంటే ముందుగానే ఉదయభాను చాలా సినిమా ఈవెంట్స్ లో అదరగొట్టేసింది. ప్రస్తుతం తక్కువగా స్టేజిలపై కనిపిస్తున్నప్పటికీ.. ఉదయభానుని ఎవరు అంత తొందరగా మర్చిపోలేరు.
Video Advertisement
ఉదయభాను యాంకర్ గా ఉన్న సమయంలోనే ఆమెపై చాలా రూమర్స్ వచ్చాయి. బాలయ్య బాబు తో ఆమె ఎఫైర్ పెట్టుకుంది అంటూ చాలానే పుకార్లు వచ్చాయి. అయితే.. వీటిని ఉదయభాను పట్టించుకోలేదు.
ప్రస్తుతం.. ఈ టాపిక్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. ఇటీవలే అఖండ ప్రొమోషన్స్ లో భాగంగా ఉదయభాను యాంకరింగ్ చేసింది. బాలయ్య లాంటి మహానుభావుడిని ఇండస్ట్రీలోనే చూడలేదని ఆమె పేర్కొన్నారు. బాలయ్య మిగతా హీరోలలా కాదని.. నిదానంగా వచ్చినా.. ఈవెంట్ చివరి వరకు ఉండేవాడని పేర్కొంది. ఆయన గొప్పదనాన్ని ఎన్నో సార్లు థాంక్స్ చెప్పానని గుర్తు చేసుకుంది. తనకు, బాలయ్య కు మధ్య ఏవో ఎఫైర్లు ఉన్నాయని చాలా రూమర్స్ వచ్చాయని.. బట్ ఐ డోంట్ కేర్.. ఎందుకంటే బాలయ్య బాబుకు అభిమానిని అయ్యాక దేనికైనా సిద్ధంగానే ఉండాలని పేర్కొంది.
End of Article