ఈ 13 “హీరోల మేనల్లుళ్లు” కూడా హీరోలు అని తెలుసా..? వారు ఎవరంటే..?

ఈ 13 “హీరోల మేనల్లుళ్లు” కూడా హీరోలు అని తెలుసా..? వారు ఎవరంటే..?

by kavitha

Ads

ఎన్నో సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో హీరోల వారసులే ఎక్కువగా హీరోలుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే.  అయితే కుమారులే కాకుండా హీరోల అక్క లేదా చెల్లెలి కుమారులు సైతం ఇండస్ట్రీలో హీరోలుగా అడుగు పెడుతున్నారు. వీరిలో కొందరు రాణిస్తున్నారు.

Video Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో మొదటిసారి ‘బ్రో’ అనే చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ మూవీ జులై 28న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో హీరోలుగా ఎంట్రీ ఇచ్చిన మేనల్లుళ్ళు ఎవరో ఇప్పుడు చూద్దాం..
1. చిరంజీవి, సాయి ధరమ్ తేజ్:

మెగాస్టార్ చిరంజీవి సోదరి కుమారుడు సాయి ధరమ్ తేజ్. మేనమామల దారిలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చి, తన కంటూ ఒక ఇమేజ్ ను ఏర్పరుచుకున్నారు.
2. వెంకటేష్ – నాగ చైతన్య:

అక్కినేని వారసుడిగా తెలుగులో హీరోగా అడుగుపెట్టిన నాగ చైతన్య, హీరో విక్టరీ వెంకటేష్‌‌కు మేనల్లుడు. ఇద్దరు కలిసి  ప్రేమమ్, వెంకీ మామ చిత్రాలలో నటించారు.
3. నాగార్జున -సుమంత్:

అక్కినేని నాగార్జున సోదరి కుమారుడు సుమంత్. తెలుగులో పలు సినిమాలలో హీరోగా సుమంత్ నటించారు.
4. మహేష్ బాబు – గల్లా అశోక్:

సూపర్ స్టార్ మహేష్ బాబు అక్క పద్మావతి కుమారుడు గల్లా అశోక్. ‘హీరో’ మూవీతో హీరోగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు.5. చిరంజీవి – వైష్ణవ్ తేజ్:

మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్  ‘ఉప్పెన’ మూవీతో తెలుగులో హీరోగా ఎంట్రీ ఇచ్చి విజయాన్ని అందుకున్నారు.
6. నాగార్జున – సుశాంత్:

అక్కినేని నాగార్జున మేనల్లుడు సుశాంత్ మేనమామ దారిలో హీరోగా టాలీవుడ్ లో అడుగుపెట్టినప్పటికీ, అంతగా గుర్తింపు పొందలేకపోయారు. ప్రస్తుతం వేరే హీరోల చిత్రాలలో సైడ్ రోల్స్ లో నటిస్తున్నారు.
7. పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్:

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మేనల్లుళ్ళు  సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్. పవన్, సాయి ధరమ్ తేజ్ తో కలిసి ‘బ్రో’ మూవీలో నటిస్తున్నారు.
8. అల్లు అరవింద్ – రామ్ చరణ్:

నిర్మాత అల్లు అరవింద్ సోదరి సురేఖ, మెగాస్టార్ చిరంజీవిల కుమారుడు రామ్ చరణ్. మెగా పవర్ స్టార్‌గా  టాలీవుడ్‌లో స్టార్ హీరోగా రాణిస్తున్న విషయం తెలిసిందే.
9. నాగబాబు – సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్:

సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ నాగబాబుకు మేనల్లుళ్లే. మెగాస్టార్ చిరంజీవి, నాగబాబు చెల్లెలు కుమారుడు. ఇద్దరు  మేనమామల దారిలో హీరోలుగా టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చారు.
10. అర్జున్ సర్జ – చిరంజీవి సర్జ:

యాక్షన్ కింగ్ అర్జున్, కన్నడ స్టార్ హీరో చిరంజీవి సర్జ మేనల్లుడు. కన్నడలో స్టార్ హీరోగా రాణిస్తున్న సమయంలోనే చిరంజీవి సర్జ గుండెపోటుతో కన్నుమూశారు.
11. అర్జున్ సర్జ – ధృవ సర్జ:

యాక్షన్ కింగ్ అర్జున్ మరో మేనల్లుడు ధృవ సర్జ. ఇతను చిరంజీవి సర్జ తమ్ముడు. కన్నడలో ధృవ సర్జ స్టార్ హీరోగా రాణిస్తున్నారు.12. ఆమీర్ ఖాన్ – ఇమ్రాన్ ఖాన్:

బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ ఆమీర్ ఖాన్ సోదరి కుమారుడు ఇమ్రాన్ ఖాన్. బాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ ఖాన్ అంతగా విజయం సాధించలేకపోయారు.
13. మహేష్ భట్ – ఇమ్రాన్ హష్మి:

బాలీవుడ్ డైరెక్టర్ మహేష్ భట్ మేనల్లుడు ఇమ్రాన్ హష్మి.హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఇమ్రాన్ హష్మి తన కంటూ ప్రత్యేక ఇమేజ్ ను తెచ్చుకున్నారు.

Also Read: జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ల‌కి జైలు శిక్ష‌ పడడానికి అసలు కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..?

 


End of Article

You may also like