జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ల‌కి జైలు శిక్ష‌ పడడానికి అసలు కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..?

జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ల‌కి జైలు శిక్ష‌ పడడానికి అసలు కారణం ఏంటి..? ఏం జరిగిందంటే..?

by kavitha

Ads

ప్రముఖ హీరో రాజశేఖర్‌, ఆయన భార్య జీవితకు నాంపల్లి 17వ మెట్రోపాలిటన్ కోర్టు పరువు నష్టం కేసులో సంవత్సరం పాటు జైలుశిక్షతో పాటుగా 5 వేల రూపాయల జరిమానాను విధించింది. అది మాత్రమే కాకుండా ఈ కేసు విషయంగా  అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం ఇస్తూ, కండిషన్స్ తో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది.

Video Advertisement

సినీ ప్రముఖులు అయిన రాజశేఖర్, జీవితల గురించి ప్రత్యేకించి చెప్పవలసిన పని లేదు. ఒకప్పటి హీరోహీరోయిన్లు అయిన వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జీవిత దర్శకురాలిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. కోర్టు వీరిద్దరికి జైలు శిక్ష ఎందుకు విధించింది? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..
jeevitha-rajasekharరాజశేఖర్‌ దంపతులు మెగాస్టార్ చిరంజీవి బ్లడ్‌ బ్యాంక్‌ పై 2011లో మీడియా సమావేశంలో చిరంజీవి బ్లడ్‌బ్యాంక్ సేకరించిన బ్లడ్ ని ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని ఆరోపణలు చేశారు. ఈ విషయం పై చిరంజీవి బావ మరిది అయిన అల్లు అరవింద్ అప్పట్లోనే రాజశేఖర్, జీవిత చేసిన విమర్శలు చేసినందుకు కోర్టును ఆశ్రయించారు.
చిరంజీవి పేరిట నడుస్తున్న ట్రస్టు, సేవా కార్యక్రమాల పై తప్పుడు ఆరోపణలు చేసారని పరువు నష్టం కేసు వేశారు.  ఎన్నో సంవత్సరాల విచారణ తరువాత మంగళవారం నాడు నాంపల్లి 17వ మెట్రోపాలిటిటన్ కోర్టు రాజశేఖర్, జీవితలకు సంవత్సరం జైలు శిక్ష మరియు 5 వేల రూపాయల జరిమానా విధించింది. ఈ కేసు పై అప్పీలుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఇచ్చింది.
ఎన్నికల సమయంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పోటీ చేసినపుడు రాజశేఖర్, జీవితలు మెగాస్టార్ చిరంజీవి పై ఎన్ని విమర్శలు చేశారో అందరికీ తెలిసిందే. అప్పుడు చిరు అభిమానులు కొందరు ఆ విమర్శలను తట్టుకోలేక వారిపై దాడి చేయడం జరిగింది. తన ఫ్యాన్స్ దాడి చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా వారి ఇంటికి వెళ్లి, క్షమించమని కోరిన విషయం కూడా తెలిసిందే.

Also Read: బిగ్‌బాస్ తెలుగు-7 లో గేమ్ ఆడడానికి వస్తున్న ఇండియన్ క్రికెటర్..! ఎవరో తెలుసా..?


End of Article

You may also like