టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి హీరోలకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అందులో నందమూరి కళ్యాణ్ రామ్ తనదైన శైలిలో ప్రేక్షకుల అభిమానం సంపాదించారు.

Video Advertisement

బింబిసారా రిలీజ్ తర్వాత ప్రస్తుతం సోషల్ మీడియాలో అలాగే ఇంటర్నెట్ లో కళ్యాణ్ రామ్ గురించి చాలామంది సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. అతని గురించే కాక అతని కుటుంబం గురించి, అతని భార్య గురించి కూడా తెలుసుకోవాలని ఎందరో ప్రయత్నిస్తున్నారు.

unknown details about kalyan ram wife

ఇక ప్రస్తుతం ఆయన భార్య గురించి కూడా అనేక రకాల కథనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యం లో ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే వివరాల్లోకి వెళితే.. హరికృష్ణకు బాగా పరిచయమున్న ఒక బిజినెస్ మెన్ కూతురు అయిన స్వాతి తో 2006 ఆగస్టు 9వ కళ్యాణ్ రామ్ వివాహం జరిగింది. కళ్యాణ్ రామ్ కు ఇద్దరు పిల్లలు కొడుకు పేరు సౌర్య రామ్ మరియు కూతరు పేరు తారక అద్వైత.కానీ కళ్యాణ్ రామ్ ఎప్పుడు తన పర్సనల్ లైఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేయడానికి ప్రాధాన్యత ఇవ్వలేదు.

unknown details about kalyan ram wife

కళ్యాణ్ రామ్ అతని సతీమణి స్వాతి ఐడియా ప్రకారం కూతురు అద్వైత పేరు మీద ఒక విజువల్ ఎఫెక్ట్స్ కంపెనీ స్థాపించాడు. మొదట చిన్న తరహా కంపెనీ గా స్టార్ట్ అయినప్పటికీ అది క్రమంగా ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో”, బాలకృష్ణ *లెజెండ్ ” వంటి చిత్రాలకు విజువల్ ఎఫెక్ట్స్ అందించి మంచి క్రేజ్ సంపాదించుకుంది. ప్రస్తుతం రిలీజ్ అయిన బింబిసారా చిత్రానికి సంబంధించిన అన్ని విజువల్ ఎఫెక్ట్స్ ని కూడా అద్వైత క్రియేటివ్ స్టూడియోస్ అందించింది. ఈ చిత్రం కు సంబంధించిన పనులు అన్నిటిని స్వాతి స్వయంగా ఎంతో జాగ్రత్తగా నిర్వహించినట్లు తెలుస్తుంది.