సింగర్ కేకే భార్య గురించి ఈ విషయాలు తెలుసా..? సింగర్ కేకే సేల్స్ మ్యాన్ గా పని చేస్తున్నప్పుడు ఏమైందంటే..?

సింగర్ కేకే భార్య గురించి ఈ విషయాలు తెలుసా..? సింగర్ కేకే సేల్స్ మ్యాన్ గా పని చేస్తున్నప్పుడు ఏమైందంటే..?

by Anudeep

Ads

సింగర్ కేకే పాడిన పాటలు చాలా సినిమాల్లో సూపర్ హిట్ గా నిలిచాయి. పాటమ్మె తన ప్రాణం అనే కేకే చివరికి ఆ పాట పాడుతోనే ప్రాణం పోగొట్టుకున్నాడు.ఈయన బాలీవుడ్ గాయకుడు. పూర్తి పేరు కృష్ణ కుమార్ కున్నాథ్.. మంగళవారం రోజున కోల్కత్తాలో మృతి చెందిన సంగతి తెలిసిందే.

Video Advertisement

ఒక లైవ్ షో చేస్తుండగా గుండెపోటుకు గురయ్యారు. దీంతో అతన్ని ఆస్పత్రికి తరలించారు. ఆసుపత్రిలో కేకే ను పరిశీలించిన వైద్యులు రాత్రి 10.30 గంటలకే ప్రాణం పోయినట్లు తెలిపారు. ప్రస్తుతం కేకే వయసు 53 సంవత్సరాలు. ఆయన ఒక హిందీలోనే కాకుండా దక్షిణాది సినిమాల్లో దాదాపు 250 పైగా పాటలు పాడారు.

అయితే.. అందరికి ఆయనకు ఓ గాయకుడిగా మాత్రమే తెలుసు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఆయన బయట ఎక్కువగా ప్రస్తావించేవారు కాదు. కానీ ఆయన తన భార్య ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి ఎదిగారు. విరహ గీతాలను, ప్రేమికుల పాటలను ఎంతో అలవోకగా పాడేసిన ఆయన జీవితంలో కూడా ఓ లవ్ స్టోరీ ఉంది. చిన్న వయసు నుంచే పాటలు పాడడం అంటే మక్కువ పెంచుకున్న కేకే కు ఆరవ తరగతిలో జ్యోతి అనే అమ్మాయితో స్నేహం కుదిరింది.

singer kk 1

వారి స్నేహం అలానే కొనసాగి ప్రేమగా మారింది. ఆమెను ప్రేమించి, 1991 లో ప్రేమ వివాహాన్ని చేసుకున్నారు. అయితే ఆయనకు పాటలు పాడడం అంటే ఇష్టం అన్న సంగతి జ్యోతికి అప్పటికే తెలుసు. అయితే.. అప్పటికి కేకే తన కుటుంబం కోసం ఇష్టాన్ని పక్కన పెట్టి సేల్స్ మ్యాన్ గా ఉద్యోగం చేసేవారు. అయితే ఆయనకు భార్యగా వచ్చాక జ్యోతి ఆయనను ప్రోత్సహించారు. ఉద్యోగం పక్కన పెట్టి పాటలు పాడాలని చెప్పారు. కుటుంబ బాధ్యతలను పంచుకుని.. భర్తకు సపోర్ట్ చేసారు. అలా పాటల రంగంలో అడుగుపెట్టిన కేకే అంచలంచెలుగా ఎదిగి స్టార్ సింగర్ అయ్యారు. అయితే వ్యక్తిగత జీవితాన్ని మాత్రం గోప్యంగానే ఉంచారు. ఆయన అకాల మరణం అభిమానులను ఎంతగానో కలచివేస్తోంది.


End of Article

You may also like