Ads
ఎన్నో సంవత్సరాలుగా హీరోగా మనల్ని అలరిస్తూ ఎంతో గుర్తింపును సంపాదించుకున్నారు రాజశేఖర్. యాక్షన్, సెంటిమెంట్, థ్రిల్లర్ ఇలా అన్ని రకాల సినిమాల్లో తనదైన స్టైల్ నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.
Video Advertisement
1984 లో ప్రముఖ దర్శకుడు భారతీ రాజా గారి దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా పుదుమై పెన్ తో సినిమా కెరీర్ మొదలు పెట్టారు రాజశేఖర్. 1989 లో వచ్చిన అంకుశం సినిమాతో ప్రేక్షకులకు ఇంకా చేరువయ్యారు రాజశేఖర్. ఆ తరువాత చాలా సినిమాలే చేసారు.
రాజశేఖర్, జీవిత ఇద్దరు సినీ ప్రేమికులకు సుపరిచితులే. వీరి కూతుర్లు శివాత్మిక, శివాని కూడా సినిమాల్లో కనిపిస్తూ ప్రేక్షకులకి పరిచయమయ్యారు. అయితే.. హీరో రాజశేఖర్ కి ఒక సోదరుడు ఉన్నాడు అన్న విషయం చాలా మందికి తెలియదు. రాజశేఖర్ కి ఒక తమ్ముడు ఉన్నాడు. అతను ఓ పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. ఆయన పేరు గుణ శేఖర్.
గుణశేఖర్ బ్యాక్ గ్రౌండ్ కూడా చాలా మందికి తెలియదు. ఆయన వజ్రాల వ్యాపారం చేస్తుంటారు. హైదరాబాద్ లో ఉన్న గుణ డైమండ్ స్టోర్ కి గుణ శేఖర్ యజమాని. మరో విశేషం ఏంటంటే ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు శంకర్ గణేష్ కు గుణ శేఖర్ అల్లుడు అవుతారు. ఆయన కూతురు శ్రీదేవిని గుణ శేఖర్ పెళ్లి చేసుకున్నారు. ఇటీవలే ఈ విషయాన్నీ శంకర్ గణేష్ ఈ విషయాన్నీ ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చారు.
End of Article