“మహర్షి” సినిమా టైటిల్ లో ఈ విషయాలు గమనించారా..? ఇంత చిన్న టైటిల్ లో అంత అర్ధం ఉందా..?

“మహర్షి” సినిమా టైటిల్ లో ఈ విషయాలు గమనించారా..? ఇంత చిన్న టైటిల్ లో అంత అర్ధం ఉందా..?

by Anudeep

Ads

ఏ సినిమాకి అయినా టైటిల్ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఒక సినిమా ని చూడాలి అన్న ఆసక్తి కలగడం లో టైటిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అందుకే.. సినిమా ఏదైనా దర్శక నిర్మాతలు టైటిల్ విషయం లో చాలా శ్రద్ధ కనబరుస్తారు. ముందు వర్కింగ్ టైటిల్ ని మాత్రమే పెట్టుకుని.. సినిమా షూటింగ్ అయ్యేలోపు సినిమా కి తగ్గ టైటిల్ ని ఆలోచించుకుంటారు.

Video Advertisement

maharshi

టైటిల్ రివీల్ చేయడం లో కూడా జాగ్రత్తలు తీసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తారు. ఐతే.. టైటిల్ ని సెలక్ట్ చేసుకోవడం లో మాత్రమే కాదు.. టైటిల్ ని పోస్టర్ లా డిజైన్ చేసే విషయం లో చాలా శ్రద్ధ కనబరచాలి. సినిమా కథ కు తగ్గట్లుగా ఈ పోస్టర్ ను డిజైన్ చేసి రిలీజ్ చేస్తారు. అలాగే.. మహర్షి సినిమా టైటిల్ ను కూడా చాలా క్రియేటివ్ గా డిజైన్ చేసారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకుంది.

maharshi 2

ఈ సినిమా టైటిల్ పోస్టర్ లో ఎన్ని విషయాలను ఎలివేట్ చేశారో పై ఫోటో లో చూడండి. మ అనే అక్షరం పైన తుపాకీ, హ అనే అక్షరం పైన కత్తి, ష వత్తు పైన స్టాట్యూ ఆఫ్ లిబర్టీ కనిపిస్తాయి జాగ్రత్త గా గమనించండి. ఈ సినిమాలో హీరో అమెరికా లోని కంపెనీ లో టాప్ పొజిషన్ లో పనిచేస్తుంటాడు. అలాగే.. ఒక వైపు పల్లెటూరు, మరొక వైపు సిటీ, మధ్య లో లెక్కల గుర్తులు కనిపిస్తాయి.. ఇవన్నీ సినిమాలో భాగమే. అందుకే వీటిని ఒక చోట చేర్చి టైటిల్ లా డిజైన్ చేసారు. క్రియేటివిటీ కి కొదవ లేదు అంటే ఇదేనేమో కదా..


End of Article

You may also like