Ads
అతిలోక సుందరి శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు అంటే ఇప్పటికీ నమ్మశక్యం కాదు. అంతగా ఆమె అందం, అభినయం తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిన్న వయసులోనే బాలనటి గా తెరంగ్రేటం చేసిన ఆమె.. అతి తక్కువ వయసులోనే స్టార్ హీరో గా ఎదిగారు. దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మెప్పించారు.
Video Advertisement
బాలీవుడ్ నిర్మాత బోనికపూర్ తో తన జీవితాన్ని పంచుకున్నారు. కానీ.. చిన్న వయసులోనే అన్నిటిని వదిలి వెళ్లిపోయారు. శ్రీదేవి గురించి తెలియనివారెవరు ఉండరు. కానీ.. శ్రీదేవి కి ఓ సోదరి ఉన్నారన్న విషయం చాలా మందికి తెలియదు. చాలా మంది నటి మహేశ్వరిని శ్రీదేవి సోదరి అనుకుంటూ ఉంటారు. వాస్తవానికి ఆమె శ్రీదేవి కి కజిన్ మాత్రమే. శ్రీదేవికి శ్రీలత అనే ఓ సోదరి ఉన్నారు.
వీరిద్దరూ ఎంత సన్నిహితం గా ఉంటారో.. అంత ఘోరం గా కొట్టుకుంటారట. సినిమా షూటింగ్ ల గ్యాప్ లో వీరు చేసే అల్లరి మాములుగా ఉండదట. వీరిద్దరూ ఏ విషయం లో ఎన్ని సార్లు పోట్లాడుకున్నా… కేవలం ఐదు నిమిషాల్లో ఇట్టే కలిసిపోతారట. శ్రీదేవి ఎక్కువ గా అమ్మ దగ్గర ఉంటె… శ్రీలత నాన్న కు దగ్గరగా ఉండేవారట. ఓ సినిమాలో వీరిద్దరూ అక్క చెల్లెల్లు గా కూడా నటించారట. ఐతే ఈ సినిమా షూటింగ్ లో నటించాలంటే.. తన కుక్కపిల్లను తీసుకురావాల్సిందేనని శ్రీలత మొండికేశారట.
ఆమె తల్లి, సోదరి శ్రీదేవి ఎంత గా నచ్చ చెప్పినా వినిపించుకోలేదట. చివరకు ఇంటికి కారు పంపించి.. ఆ కుక్కపిల్లను తీసుకొచ్చేదాకా షూటింగ్ ను నిలిపేయాల్సి వచ్చిందట. ఈ సినిమాలోనే ఒకామె శ్రీలత కొట్టే సీన్ కూడా ఉందిట. అయితే.. ఆమె రిహార్సల్స్ లో సరిగా ప్రాక్టీస్ చేయకపోవడం తో.. ఈ సీన్ ను రెండుసార్లు చేయాల్సొచ్చింది. ఆ డైరెక్టర్ కొట్టడం కూడా రాదా అనడంతో.. ఆమె ఎక్కువ ఫీల్ అయ్యి శ్రీలత ను గట్టిగా కొట్టారట. దీనితో.. శ్రీదేవి ఎమోషనల్ అయిపోయి ఏడ్చేశారట. వాస్తవానికి ఆమె ఏడవకూడదు. కానీ.. శ్రీదేవి ఏడ్చేయడం తో ఈ సీన్ ను మరోసారి షూట్ చేయాల్సి వచ్చింది.
అయితే ఈ సినిమా శ్రీలత కు అంత పేరు తీసుకురాలేదు. వీరిద్దరూ ఎంత పోట్లాడుకున్నా.. ప్రేమ కూడా అంతే ఉండేది అనడానికి ఇదే ఉదాహరణ. శ్రీదేవి ఎక్కువ గా నైలాక్స్ చీరలు కట్టుకోవడానికి ఇష్టపడేవారట. ఆమె సోదరి శ్రీలత మాత్రం ఆర్గండీ, కాటన్ చీరలు ధరించేవారు. చీరలు ఏమైనా.. ఇద్దరికీ ఒకేరంగు చీరలు తీసుకునేవారట. అలాగే.. శ్రీదేవి కూడా తాను ఎప్పుడు అవుట్ డోర్ షూటింగ్ కి వెళ్లినా తన చెల్లెలు శ్రీలత కోసం ఏమైనా కచ్చితం గా కొనేవారట.
చాలా కాలం వరకు వీరిద్దరూ ఒకే మంచాన్ని షేర్ చేసుకుని.. కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవారట. ఎంతో అన్యోన్యం గా వుండే వీరిద్దరిని ఆస్తి గొడవలు వేరు చేసాయి. సంజయ్ రామ స్వామి అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న శ్రీలత హ్యాపీగానే ఉన్నారు. ఆ తరువాత శ్రీదేవి కూడా బోని కపూర్ ని వివాహం చేసుకున్నారు. చాలా కాలం వరకు వీరిద్దరికి మాటలు లేవని.. బోని కపూర్ చొరవతోనే వీరిద్దరూ తిరిగి దగ్గరయ్యారని కూడా చెబుతుంటారు. శ్రీదేవి ప్రమాదవశాత్తు మరణించిన సమయం లో కూడా శ్రీలత అక్కడే ఉన్నారు. ఈ విషయమై శ్రీలత మౌనం గానే ఉన్నారు.
End of Article