జబర్దస్త్ లో లేడీ ఆర్టిస్ట్ ఫైమా గురించి ఈ విషయాలు తెలుసా..? ఆమె జబర్దస్త్ కు ఎలా వచ్చారంటే..?

జబర్దస్త్ లో లేడీ ఆర్టిస్ట్ ఫైమా గురించి ఈ విషయాలు తెలుసా..? ఆమె జబర్దస్త్ కు ఎలా వచ్చారంటే..?

by Anudeep

Ads

జబర్దస్త్.. ఎందరో ప్రేక్షకులకు వినోదాన్ని పంచడమే కాదు.. ఎందరో ఆర్టిస్ట్ లకు ఓ దారిని కూడా చూపించింది. జబర్దస్త్ మొదలైన తొలినాళ్లలో ఎక్కువ గా అబ్బాయిలే ఆర్టిస్ట్ లు గా ఉండే వారు. ఆడ ఆర్టిస్ట్ లు అవసరం అయినప్పుడు కూడా మగవారే ఆడవారి గెటప్ లు వేసి అలరిస్తూ ఉండేవారు. అదో యూనీక్ గా చాలాకాలం జబర్దస్త్ లో కొనసాగింది.

Video Advertisement

faima 1

ఆ తరువాత మొదటి లేడీ కమెడియన్ గా సత్య వచ్చారు. ఆమె చమ్మక్ చంద్ర టీం లో స్కిట్ లు వేస్తూ అలరించారు.ఆ దారిలోనే.. ఫైమా కూడా ఎంట్రీ ఇచ్చారు. లేడీ కమెడియన్ గా వరుస స్కిట్ లతో అలరిస్తున్నారు. ఇటీవల ఈ షో లో వేస్తున్న స్కిట్ లలో కొంత అడల్ట్ కామెడీ ఎక్కువ అవుతోంది అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి కానీ.. ఈ షో కి మంచి రెస్పాన్స్ వస్తూనే ఉంది.

faima 2

ఇప్పటికే జబర్దస్త్ చాలా మంది ఆర్టిస్ట్ లకు జీవితాన్నిచ్చింది. ఈ షో పై స్కిట్ లు చేసి మంచి పేరు తెచ్చుకున్న వారు వెండితెరపై కూడా అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారు. ఇక.. ఫైమా విషయానికి వస్తే ఆమె కామెడీ టైమింగ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకోవడం తో తక్కువ టైం లోనే ఆమె బాగా పాపులర్ అయ్యారు.

faima 3

పటాస్ 2 తో మంచి పేరు తెచ్చుకున్న ఫైమా.. మొన్నామధ్య కాస్టింగ్ కౌచ్ పై కూడా తన గళం విప్పింది. పటాస్ 2 తో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న ఫైమా జబర్దస్త్ లో కూడా తన కామెడీ టైమింగ్ తో దుమ్ము లేపుతున్నారు. ఇతర కంటెస్టెంట్ లకు ఏమాత్రం తగ్గకుండా ఆమె కు రెమ్యునరేషన్ ఇస్తున్నారని సమాచారం.


End of Article

You may also like