Ads
జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకమైన పరిచయం అనవసరం. గత ఏడేళ్లుగా ఎంతో మంది ఆర్టిస్ట్ లను పరిచయం చేస్తూ.. ఎందరో ఇళ్లల్లో నవ్వుల పూవులు పూయిస్తోంది. ఈ షో స్టార్ట్ అయిన తొలినాళ్లలో ఎక్కువగా మేల్ ఆర్టిస్ట్ లే జబర్దస్త్ లో కనిపించే వారు. వారే ఆడవారి పాత్రలను కూడా ధరిస్తూ.. పంచ్ లు వేసి మెప్పించే వారు. దాదాపు చాలా ఏళ్ల వరకు ఇదే ట్రెండ్ కొనసాగింది.
Video Advertisement
అయితే.. సత్య శ్రీ చమ్మక్ చంద్ర స్కిట్ లలో చేయడం ప్రారంభించిన తరువాత జబర్దస్త్ స్టేజిపై కూడా అమ్మాయిలు రావడం స్టార్ట్ చేసారు. సత్య శ్రీ తరువాత పవిత్ర కూడా జబర్దస్త్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ కోవలోకే మరో అమ్మాయి కూడా వచ్చి చేరింది. తనెవరో కాదు రీతూ చౌదరి. ఆమె షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లలో నటించడం ద్వారా పాపులారిటీని సంపాదించుకున్నారు. ఇవే కాదు.. ఆమె ఓ సీరియల్ లో కూడా నటిస్తున్నారు.
జీ తెలుగులో ప్రసారం అయ్యే “ఇంటిగుట్టు” అనే సీరియల్ లో కూడా ఆమె నటిస్తున్నారు. ఇది కాక, “గోరింటాకు” సీరియల్ లో ఆమె నెగటివ్ రోల్ లో నటిస్తున్నారు. మరో వైపు సోషల్ మీడియాలో కూడా ఈ బ్యూటీ చాలా ఆక్టివ్ గా ఉంటారు. ఆమె పోస్ట్ చేసే ఫోటోలకు కూడా చాలానే ఫాలోయింగ్ ఉంది. ప్రదీప్ యాంకరింగ్ చేసిన “పెళ్లి చూపులు” షోకి కూడా రీతూ చౌదరి హాజరు అయ్యారు.
రియల్ లైఫ్ లో రీతూ చౌదరికి నాగ చైతన్య అంటే చాలా ఇష్టమట. సీనియర్ హీరోల్లో నాగార్జున అంటే చాలా ఇష్టమట. సీరియల్ హీరోలలో కూడా చాలా మంది హ్యాండ్సమ్ గా ఉన్నా.. తనకి ఏ సీరియల్ హీరో పైనా క్రష్ లేదని తేల్చి చెప్పేసారు. “చైతూని కలిసే ఛాన్స్ వచ్చినా.. ఆయన్ని దూరం నుంచే ప్రేమిస్తా..” అంటూ గతంలో రీతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.
End of Article