పేపర్ లో వచ్చిన ఓ వార్త చూసి బిచ్చగాడు సినిమా తీసారట..బిచ్చగాడు సినిమా కి ముందు ఏమి జరిగిందంటే..?

పేపర్ లో వచ్చిన ఓ వార్త చూసి బిచ్చగాడు సినిమా తీసారట..బిచ్చగాడు సినిమా కి ముందు ఏమి జరిగిందంటే..?

by Anudeep

Ads

విజయ్ ఆంటోనీ “బిచ్చగాడు” మూవీ తమిళం లోనే కాదు తెలుగు నాట కూడా మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ సినిమా ఎక్కడ నుంచి ప్రేరణ పొందిందో తెలుసా..? ఒక న్యూస్ పేపర్ నుంచి. తమిళ్ డైరెక్టర్ శ‌శి తన బుక్స్ ని సర్దుకుంటుంటే.. ఒక న్యూస్ పేపర్ కనిపించిందట.

Video Advertisement

bichhagadu feature

ఆ న్యూస్ లో పేపర్ శశి కి ఒక న్యూస్ చాలా ఇంటరెస్టింగ్ గా కనిపించింది. ఓ బిచ్చగాడు బిజినెస్ మాన్ గా ఎలా మారాడు అన్న స్టోరీ అది. ఆ రోజు రాత్రి నిద్రలో కూడా అతను అదే కల కన్నాడట. దీనితో ఎలాగైనా, ఈ పాయింట్ లో సినిమా తీయాలని అనుకున్నారట. అయితే చాలా మందికి ఈ స్టోరీ లైన్ చెప్పినప్పటికీ అందరు బిచ్చగాడు టైటిల్ తో సినిమా ఏంటి..? అని నిరుత్సాహ పరిచారట. అయితే, శశి మాత్రం తన కథ మీద నమ్మకం ఉంచుకుని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడట.

bichhagadu 3

తమిళ్ నేటివిటీ కి తగ్గట్లు కొన్ని మార్పు చేర్పులు చేసుకుని కథను సిద్ధం చేసుకున్నాడట. ఓ సారి విజయ్ ఆంటోనీ ని కలిసి ఈ కథను వివరించాడట. విజయ్ ఆంటోనీ అయితే తనకి కథ నచ్చితే తానే ప్రొడ్యూస్ చేస్తాడు, మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తాడు. అందుకే, శశి ముందు విజయ్ ఆంటోనీ ని సంప్రదించాడు. అయితే, అనుకున్నట్లు గానే ఈ కథ విజయ్ ఆంటోనీ కి బాగా నచ్చేసింది. ఈ సినిమాలో నటించడానికి, ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చాడు.

bichhagadu 2

కానీ, మ్యూజిక్ డైరెక్టర్ ని మాత్రం వేరే ఎవరినైనా పెట్టుకుందామని ఆంటోనీ చెప్పాడట. అలా, రెండు కోట్ల బడ్జెట్ లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసేసారు. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా విజయ్ ఆంటోనీ నే పని చేసాడు. ఈ సినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు నలభై కోట్లను కలెక్ట్ చేసిన సంగతి మనకి తెల్సిందే. అసలు ఈ సినిమా ని తెలుగు లో రీమేక్ చేయాలనుకున్నారు. తొలుత రానా ను, సునీల్ ను సంప్రదించినా.. తెలుగు వాళ్లకి నచ్చకపోవచ్చు అని చెప్పి ఇద్దరు ఈ సినిమా ని రిజెక్ట్ చేశారట. కానీ, చ‌ద‌ల‌వాడ ల‌క్ష్మ‌ణ్ ఈ సినిమా డబ్బింగ్ రైట్స్ ను 45 లక్షల పెట్టి కొనుక్కున్నాడు. తెలుగు లో రిలీజ్ ఐన బిచ్చగాడు ఇక్కడ కూడా మంచి టాక్ తెచ్చుకుని 20 కోట్ల కలెక్షన్ రాబట్టింది.


End of Article

You may also like