Ads
ప్రస్తుతం ఎక్కడ చూసినా నడుస్తున్న టాపిక్ పుష్ప. ఈ సినిమాలో అల్లు అర్జున్ చాలా డిఫరెంట్ గా కనిపిస్తున్నారు. అంతే కాకుండా ఈ సినిమా అల్లు అర్జున్ మొదటి పాన్ ఇండియన్ సినిమా. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి.
Video Advertisement
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా పుష్ప సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించారు. చాలా సేపు ఎదురు చూసిన తర్వాత పుష్ప ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది. ఇందులో సినిమా బృందం ఇండైరెక్ట్ గా సినిమాకి సంబంధించిన కొన్ని ముఖ్య విషయాలను చెప్పింది. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Also Read: ఈ చిన్నప్పటి టాలీవుడ్ సెలెబ్రిటీని ఎవరో గుర్తుపట్టారా..? చెప్పుకోండి చూద్దాం..!
#1 మొదటి షాట్లో అల్లు అర్జున్ , అలాగే కొంత మంది ఎర్ర చందనం తీసుకెళుతున్నట్టు మనం చూడొచ్చు.
ఆ చందనాన్ని బరువు కొలిచి, లెక్కలు రాస్తున్న ఇద్దరు వ్యక్తులని కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఇందులో అల్లు అర్జున్ చందనాన్ని తాడుకి కట్టి పైకి లాగడం మనం చూడొచ్చు.
తర్వాత ఆ చందనం అంత కలిపి కట్టిన తాడుని అల్లు అర్జున్ కట్ చేయడం, చుట్టు పక్కన ఉన్న కొంత మంది హడవిడిగా పరిగెట్టడం కూడా మనం చూడొచ్చు.
#2 ఒక ఫైట్ కి సంబంధించిన కొన్ని సీన్స్ మనకి ట్రైలర్ లో చూపించారు.
ఇందులో అల్లు అర్జున్ కన్నడ నటుడు ధనుంజయని కొడుతూ ఉంటారు. ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తల ప్రకారం ధనుంజయ మంగళం శ్రీను అంటే సునీల్ కొడుకట. ఇతను శ్రీవల్లి పాత్ర పోషిస్తున్న రష్మికతో తప్పుడుగా ప్రవర్తించడం వల్ల, దాంతో పుష్పరాజ్ అతనిని కొట్టడం వల్ల గొడవలు మొదలవుతాయి.
#3 ఇక్కడ ఒక లారీ వెళ్లడం మనం చూడొచ్చు. ఇందులో ఉన్నది పుష్పరాజ్.
ఇదే సీన్ కి కొనసాగింపుగా పోలీసులు ఆ లారీని వెంబడిస్తూ ఉంటారు. ఇక్కడ బైక్ మీద పోలీస్ ఉన్నాడు.
ఆ లారీలో పైన కొన్ని పండ్లు ఉండడం కూడా మనం గమనించవచ్చు. అంటే పళ్ళు తీసుకెళ్తున్నట్టు చెప్పి ఎర్ర చందనం తీసుకెళ్తున్నారు.
#4 అలాగే హీరోయిన్ రష్మిక కూడా కొన్ని సీన్స్ లో కనిపించారు. ఈ షాట్ చూస్తే శ్రీవల్లి పాల వ్యాపారం చేస్తారు అని మనకి అర్ధం అవుతుంది.
ఇందులో రష్మిక పక్కన ఉన్న దివ్య శ్రీవల్లి చెల్లెలి పాత్ర పోషిస్తున్నట్టు సమాచారం.
అలాగే పుష్పరాజ్, శ్రీవల్లి పెళ్లి చూపులు కూడా మనం ఇందులో చూడొచ్చు.
#5 ఇందులో మొదటి సీన్ లో పుష్ప ని కొట్టిన పోలీస్ పుష్ప ని వెంబడించడం, తర్వాత పుష్ప పడిపోవడం కూడా చూడొచ్చు. ఆ తర్వాత ఆ జైల్లో వేసి పుష్ప ని ఇంటరాగేషన్ చేసే సీన్ ఉండొచ్చు.
#6 ఇక్కడ కనిపించే అతను పుష్పకి స్నేహితుడు అయ్యి ఉండొచ్చు.
ఈ బైక్ సీన్ లో కొంత మంది రౌడీలు అతనిని పట్టుకొని ఉంటె పుష్ప వెళ్లి వాళ్ళతో ఫైట్ చేసి అతనిని కాపాడడం మనం చూడొచ్చు.
అలాగే అజయ్ కూడా ఒక సీన్ లో కనిపించారు. ఇందులో అజయ్ ఒక తహసీల్దార్ లేదా మంగళం శ్రీను దగ్గర అకౌంట్స్ చూసే వ్యక్తిగా కనిపిస్తారు అని సమాచారం.
#7 అలాగే రావు రమేష్, చంద్రగిరి నియోజక వర్గానికి ఎమ్మెల్యే అయిన, ప్రజా చైతన్య పార్టీకి చెందిన భూమిరెడ్డి సిద్ధప్ప నాయుడు పాత్రలో కనిపిస్తున్నారు.
ఈ పక్కన ఉన్న బ్యానర్ చూస్తే తర్వాత సిద్ధప్ప నాయుడు రాష్ట్రమంత్రి అయినట్టు కూడా మనం చూడొచ్చు. అలాగే అదే బ్యానర్ మీద కింద, భూమిరెడ్డి సిద్ధప్ప నాయుడు, చంద్రగిరి నియోజకవర్గం, రోడ్లు మరియి రవాణా శాఖ మంత్రివర్యులు అని రాసి ఉంటుంది.
అల్లు అర్జున్ ఇదే పార్టీలో చేరినట్టు, రావు రమేష్ అల్లు అర్జున్ ని అభినందించడానికి వస్తున్నట్టు మనం చూడొచ్చు.
#8 ఇక్కడ ఫహద్ ఒక కేస్ స్టడీ చేస్తున్నట్టు మనకి కనిపిస్తున్నారు. ఈ షాట్ జూమ్ చేసి చూస్తే, గంజి బండలు ఏరియా, ఫారెస్ట్ అఫీషియల్స్ బ్రూటల్లీ కిల్డ్ బై RS వుడ్ (GANJI BANDALU AREA, FOREST OFFICIALS BRUTALLY KILLED BY RS WOOD) అనే న్యూస్ కనిపిస్తుంది. అంటే ముందు అల్లు అర్జున్ ని కొట్టినట్టు చూపించిన అతను ఫారెస్ట్ ఆఫీసర్. అతను చనిపోవడంతో అతని స్థానంలో ఫహాద్ వచ్చినట్టు మనకి తెలుస్తోంది.
#9 ఇతను మంగళం శ్రీను తమ్ముడి పాత్ర పోషిస్తున్నాడు అని సమాచారం.
ఇక్కడ జరిగే ఫైట్ మంగళం శ్రీను ఇంట్లోనే, అతని తమ్ముడిని కొట్టడానికి వచ్చినప్పుడే జరుగుతుంది. వెనకాల మంగళం శ్రీను భార్య పాత్ర పోషించిన అనసూయ కూడా కనిపిస్తున్నారు.
ఇదే సీన్ కి కొనసాగింపు చివరిలో అల్లు అర్జున్ వార్నింగ్ ఇచ్చే డైలాగ్. చివరిలో కూడా ఈ షాట్ లో మంగళ్ శ్రీను పక్కన అతను కనిపిస్తున్నాడు.
#10 అంతే కాకుండా ఏ బిడ్డ పాటలోని ఒక షాట్, సామీ సామీ పాట, అలాగే శ్రీ వల్లి, దాక్కో దాక్కో మేక పాటలోని కొన్ని షాట్స్ కూడా మనం చూడొచ్చు.
ఇది చివరిలో ఒక పార్టీ జరుగుతున్నట్టు చూపించిన సీన్. ఇది సమంత స్పెషల్ సాంగ్. ఇందులో పుష్పతో మొదట్లో పని చేసిన వాళ్ళు, రావు రమేష్, పుష్ప స్నేహితుడు, అలాగే అజయ్ ఘోష్ కూడా కనిపిస్తున్నారు. అజయ్ ఘోష్ కి, సునీల్ కి పడదు అని, అప్పటి వరకు మంగళం శ్రీను దగ్గర పని చేసిన పుష్ప, అతనికి వ్యతిరేకం అవ్వడంతో అజయ్ ఘోష్ పాత్ర పుష్పకి మద్దతు ఇస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఈ విషయాల్లో ఎంత వరకు నిజమో తెలుసుకోవాలంటే సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
End of Article