Ads
భారతదేశం మొత్తం ఎప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఆర్ఆర్ఆర్ కి సంబంధించిన వీడియో ఒకటి ఇటీవల విడుదల చేశారు. ఆ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉంది. ఆ వీడియోలో కొన్ని విషయాలని మనకి ఇన్ డైరెక్ట్ గా చెప్పారు. కొన్ని ముఖ్యమైన సీన్లకు సంబంధించిన షాట్స్ కూడా చూపించారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Video Advertisement
#1 వీడియోలోని మొదటి షాట్ లో స్టోరీ బోర్డ్ లో ఉన్న ఒక పిక్చర్ లో ఒక పెద్ద చోటులో గన్స్ పెట్టి ఉన్నట్టు కనిపిస్తాయి.
తర్వాత అదే సీన్ మనకి సెట్ లో కనిపిస్తుంది. కింద కనిపించే ఫోటో అదే.
#2 ఇందులో చాలా మంది ఆర్టిస్టులు ఒక చోట ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎక్కడపడితే అక్కడ నుంచోకుండా ఒక ఫార్మాట్ లో నుంచొని ఉన్నారు. దాన్ని బట్టి అక్కడ సాంగ్ షూట్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.
#3 ఇది చూస్తే ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతున్నట్లు మనకి అర్థమైపోతుంది.
ఇప్పుడు కింద కనిపించే పిక్చర్ గమనించండి. ఇందులో ట్రక్ వెళ్ళేది అదే ఫంక్షన్ కి అయ్యి ఉండొచ్చు ఎందుకంటే కింద రెడ్ కలర్ కార్పెట్ ఉంది. అది కూడా బ్రిటిష్ వాళ్ళ ఫంక్షన్ అయ్యుండొచ్చు. ఎందుకంటే అక్కడ కూర్చున్న వాచ్మెన్ ఇండియన్ అతని లాగా లేరు.
#4 ఇక్కడ ఒక బాబు ఒక రాయి మీద నుంచొని ఉన్నట్టు, అతని చుట్టూ మంటలు ఉన్నట్టు చూపించారు.
మనం సరిగ్గా గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఇటీవల విడుదల చేసిన పోస్టర్ లో ఎన్టీఆర్ వెనక బ్యాక్ గ్రౌండ్ లో మంటలు ఉంటాయి. బహుశా ఆ పోస్టర్ కి, మనకి ఆ వీడియోలో చూపించిన సీన్ కి సంబంధం ఉండొచ్చు.
#5 అంతే కాకుండా అసలు సినిమాలో పాత్ర కట్ అయిపోతుంది అని అనుకున్న శ్రియా సరన్, అలాగే సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్న సముద్రఖని గారు కూడా వీడియోలో కనిపించారు. వీళ్లు మాత్రమే కాకుండా కొంత మంది ఫారిన్ ఆర్టిస్టులు కూడా ఈ వీడియోలో కనిపించారు.
#6 ఒక సీన్ లో బైక్ స్కిడ్ అవుతున్నట్టు మనకి కనిపిస్తుంది. ఆ బైక్ మీద నంబర్ డీఈ (DE) తో మొదలవుతుంది. ఈ సినిమాలో మూడు బైక్లను వాడారట. డీఈ అంటే డెలవేర్ యుఎస్ స్టేట్ (Delaware) అని అర్థం.
#7 ఇవి మాత్రమే కాకుండా ఒక షాట్ లో పోలీస్ యూనిఫాం వేసుకుని ఒక వ్యక్తి వచ్చినట్టు, ఆయన వైపు మిగిలిన పోలీసులు అందరూ చూస్తున్నట్టు ఒక షాట్ ఉంది. అక్కడ నుంచొని ఉన్న పోలీస్ రామ్ చరణ్ అని మనం అర్థం చేసుకోవచ్చు.
#8 ఇంకొక షాట్ లో సినిమా బృందం అంతా ఒక జైలు సెట్ దగ్గర డిస్కస్ చేసుకుంటున్నట్టు చూపించారు. అంతే కాకుండా వెనకాల కొంత మంది ఇండియన్ కానిస్టేబుల్స్, ఫారిన్ కానిస్టేబుల్స్ ఉన్నారు. అలా జైలు సీన్స్ కి సంబంధించిన కొన్ని షాట్స్ కూడా ఈ వీడియోలో మనకు చూపించారు.
#9 అంతే కాకుండా రామ్ చరణ్ పోలీస్ గెటప్ కి సంబంధించిన ఒక షాట్ కూడా ఈ వీడియోలో ఉంది. ఆ షాట్ లో రామ్ చరణ్ ఖాకీ దుస్తుల్లో కనిపిస్తున్నారు.
#10 ఒక షాట్ లో జూనియర్ ఎన్టీఆర్ పరిగెడుతున్నట్లు చూపిస్తారు. సరిగ్గా గమనిస్తే జూనియర్ ఎన్టీఆర్ ఒంటిపై రక్తం ఉంటుంది. మరి దీని వెనకాల ఉన్న కారణం ఏంటో, ఈ సినిమాలో పులి ఫైట్ ఉంటుంది అన్నారు బహుశా ఆ ఫైట్ కి సంబంధించినదా? లేదా వేరే ఏదైనా సీన్ కి సంబంధించినదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మనం సినిమా విడుదలయ్యే వరకు ఆగాల్సిందే.
ఇవన్నీ మాత్రమే కాకుండా జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫైట్ చేస్తున్న కొన్ని షాట్స్ కూడా ఈ వీడియోలో ఉన్నాయి.
End of Article