అరుణాచలం సూపర్ స్టార్ రజినీకాంత్ కెరీర్ లో నటించిన సూపర్ హిట్ చిత్రాల్లో ఒకటి. అప్పట్లో ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. 1997లో విడుదల అయిన ఈ చిత్రంలో రజినీకాంత్ ద్విపాత్రాభినయం చేసి ఆకట్టుకున్నారు.

Video Advertisement

ఇంకా ఈ సినిమాలో రజినీకాంత్ పక్కన హీరోయిన్లుగా  సౌందర్య, రంభ నటించారు. ఈ చిత్రంలోని ప్రతి పాత్ర కూడా ఇప్పటికి అందరికి గుర్తుండే ఉంటుంది. ముఖ్యంగా ఈ చిత్రంలో రజినీకాంత్ బామ్మ క్యారెక్టర్ చేసిన నటి చాలా పాపులర్ అయింది. ఆమె నెగిటివ్ పాత్రలో నటించి, ఆకట్టుకుంది. ఆ నటి గురించి ఇప్పుడు చూద్దాం..
ఆ నటి పేరు వడివుక్కరసి. ఆమె కోలీవుడ్ లో పాపులర్ యాక్టర్. ఆమె ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశారు.  తెలుగులో కూడా తమిళ డబ్బింగ్ చిత్రాల ద్వారా గుర్తింపు సొంతం చేసుకుంది. ఆమె తన వయసు కన్నా ఎక్కువ  వయసు పాత్రలలో మెప్పించింది. వడివుక్కరసి సుమారు 350 పైగా సినిమాలలో నటించి పేరు తెచ్చుకుంది.
అయితే ఆమె తొలిసారి తెలుగు ఆడియెన్స్ కి కనిపించింది అరుణాచలం సినిమాతోనే. ఈ మూవీలో వడివుక్కరసి క్యారెక్టర్ కీలకమైనది. ఈ చిత్రంలో ఆమె చెప్పిన  డైలాగ్స్ ఆడియెన్స్ కి బాగా గుర్తుండిపోయాయి. ఈ మూవీలో బామ్మగా, వంగిన నడుముతో గూని ఉన్నట్టుగా కష్టపడుతూ కూడా షూటింగ్ అంతా సింగిల్ షాట్ లోనే  చేసిందట.ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ కన్నా ఎనిమిది సంవత్సరాలు చిన్న వయసు అయినా కూడా ఆమె బామ్మ పాత్రలో మెప్పించింది. ఇక ఈ చిత్రంలో ఆమె యాక్టింగ్ చూసి, రజనీకాంత్ వడివుక్కరసి గట్టిగా హత్తుకున్నారట.  అంతే కాకుండా నువ్వు ఎంతో ప్రతిభ ఉన్న నటివి అని ఎంకరేజ్ చేశారంట. ఈ విషయాన్ని వడివుక్కరసి ఎప్పటికీ మర్చిపోలేను అని చాలా సందర్భాల్లో చెప్పారు. ఆమె రజినీకాంత్ తో శివాజీ సినిమాలో ఆయనకు తల్లిగా నటించింది. Also Read: సమంత ‘శాకుంతలం’ చిత్రంలో ఎన్ని కిలోల బంగారు నగలు ధరించిందో తెలుసా?