కూతుర్ని చూసి జలస్ ఫీలవుతున్న ఉపాసన.. చరణ్ క్లీంకారా బాండింగ్ పై పెదవి విప్పిన మెగా కోడలు!

కూతుర్ని చూసి జలస్ ఫీలవుతున్న ఉపాసన.. చరణ్ క్లీంకారా బాండింగ్ పై పెదవి విప్పిన మెగా కోడలు!

by Mounika Singaluri

మెగాస్టార్ చిరంజీవి కోడలుగా, ప్రతాపరెడ్డి మనవరాలు గానే కాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ భార్యగా, ఒక సమాజ సేవకురాలిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకుంది ఉపాసన కొణిదెల. ప్రస్తుతం అపోలో బాధ్యతలు చూసుకుంటున్న ఉపాసన నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఆరోగ్యం మీద ప్రజలకి ఎవేర్నెస్ పెంచే వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది.

Video Advertisement

అయితే ఈమధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసన భర్త రామ్ చరణ్, కూతురు క్లీంకార ల మధ్యన ఉన్న బాండింగ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అమ్మాయిలు నాన్న కూచి అంటారు అది నిజమేనా? మీ అమ్మాయి విషయంలో కూడా ఇది జరుగుతుందా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఇది కచ్చితంగా నిజమైన స్టేట్మెంట్. అంతే కాదు నా కూతురు విషయంలో కూడా ఇది పక్కాగా జరుగుతుంది.

నా కూతురికి, చరణ్ కి ఉన్న బాండింగ్ చూస్తే నాకు జెలసీగా ఉంటుంది. తండ్రిని చూడగానే క్లింకారా కళ్ళల్లో స్పార్క్ కనిపిస్తుంది, ఆమె మొహం లో వెలుగు కనిపిస్తుంది. నాకు అదంతా చూస్తే హే కమాన్ అనుకుంటూ ఉంటాను అని సరదాగా చెప్పుకొచ్చింది ఉపాసన. పదేళ్ల తర్వాత తల్లిదండ్రులు అయ్యారు కదా ఎలా ఫీల్ అవుతున్నారు అనే ప్రశ్నకు సమాధానంగా అందరూ తల్లి కావటం గ్రేట్ అని ఫీల్ అవుతారు..

నేను మాత్రం డబల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నాను. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు ఇలాంటి మాటలు నా వరకు చాలా వచ్చాయి, ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే మేము అన్ని విధాల సిద్ధంగా ఉన్నప్పుడే బిడ్డని కనాలి అనుకున్నాము అందుకే ఇన్నాళ్లు పట్టింది అని చెప్పింది ఉపాసన. ఉపాసన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి. క్లింకారా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అనమాట అంటూ ఆనంద పడిపోతున్నారు మెగా అభిమానులు.


You may also like

Leave a Comment