ఆ ఒక్క పరీక్ష కోసం.. పసిబిడ్డని, కార్పొరేట్ జాబ్ ని పక్కన పెట్టింది.. ఇన్ స్పైర్  చేస్తున్న “అను” సక్సెస్ స్టోరీ..!

ఆ ఒక్క పరీక్ష కోసం.. పసిబిడ్డని, కార్పొరేట్ జాబ్ ని పక్కన పెట్టింది.. ఇన్ స్పైర్  చేస్తున్న “అను” సక్సెస్ స్టోరీ..!

by Anudeep

Ads

చదువైపోగానే ఏదో ఒక జాబ్ వచ్చేయగానే.. హమ్మయ్య సాధించేసాం అనుకుంటాం. ఆ రిలీఫ్ వేరే లెవెల్ లో ఉంటుంది. కానీ జాబ్ చేస్తూ..చేస్తూ..నెలలు గడిచిపోయాక ఏదో అసంతృప్తి మొదలవుతుంది. పండగకి ఒక్కరోజు సెలవ కోసం నానా తిప్పలు పడాల్సి వస్తే ఇది కాదు మనం కోరుకున్న లైఫ్ అనిపిస్తుంది.. గవర్నమెంట్ జాబ్ వైపు ధ్యాస మళ్లుతుంది. కానీ ఒక్కో ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం అంత ఈజీ ఏమి కాదు. అందులోను, సివిల్స్ పరీక్ష పాస్ అవ్వాలంటే లైఫ్ ని పక్కనపెట్టి మరీ కష్టపడాలి.

Video Advertisement

ఆ తరువాత వచ్చే బెనిఫిట్స్ నేను మీకు చెప్పక్కర్లేదు అనుకుంటా. ఈ పరీక్షలో పాస్ అయిన వారందరు వారి జీవితం లో కొన్నిరోజుల పాటు అన్ని త్యాగం చేసేసి కష్టపడి ఉంటారు. అలాంటి ఓ అమ్మాయి స్టోరీ ని మనం ఈరోజు తెలుసుకుందాం.

anu upsc 1

తన పేరు అను. హర్యానా లోని సోనిపట్ కు చెందిన అమ్మాయి. అందరిలానే చదువుకుంది. ఎంబీఏ చేసింది. చదువుకోవడం కోసం మొట్ట మొదటి సారి ఇంటికి దూరం గా హాస్టల్ లో ఉంటూ చదువుకుంది. స్వతహాగానే మెరిట్ స్టూడెంట్ అయినా అను మంచి మార్క్స్ తెచ్చుకోవడమే కాకుండా.. క్యాంపస్ సెలెక్షన్స్ లోనే జాబ్ కొట్టేసింది. ఐసీఐసీఐ కంపెనీ లో జాబ్ తెచ్చుకుంది. జాబ్ కోసం ముంబై కి వచ్చేసింది. రెండేళ్ల పాటు జాబ్ చేసింది.

“ముంబై లో తాను ఎంతో నేర్చుకున్నానని, జాబ్ చేస్తున్నంత కాలం ఫైనాన్సియల్ గా ఎలాంటి ఇబ్బందులు లేవని.. ఆర్ధికం గా సంతృప్తి గా ఉన్నట్లు” అను ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటుంది. కానీ, ఒకసారి ఆర్ధికం గ సెటిల్ అయ్యాక మానసికంగా అసంతృప్తి మొదలవుతుంది. తానేదో సాధించాలని తన మనసుకు అనిపిస్తున్నట్లు అను ఫీల్ అయ్యేది.

anu upsc 2

చదువుకునే రోజుల్లో మెరిట్ స్టూడెంట్ అయిన అను కి తన టీచర్లే సివిల్స్ పరీక్షలకు వెళ్లాలని సూచించేవారట. జాబ్ లైఫ్ లో కి వచ్చాక, అనుకి సివిల్స్ పరీక్షలు పాస్ అవ్వాలని, జాబ్ కొట్టాలని అనిపించడం మొదలు పెట్టింది. ఆలోపు తల్లి తండ్రులు పెళ్లి చేసేయడం తో గుర్గావ్ కు వచ్చి స్థిరపడింది. పెళ్లి అయ్యాక కూడా తాను పరీక్షల గురించి ఆలోచించడం మానలేదు. ఎలా అయిన సరే సివిల్స్ లో పాస్ అవ్వాలని పట్టుదల గా చదివింది. జాబ్ ను వదిలేసింది. పెళ్లి అయ్యాక పుట్టిన పసిబిడ్డ ను కూడా తల్లి వద్ద ఉంచేసి తాను చదవడం మొదలు పెట్టింది. రోజు ఉదయం నాలుగు గంటలకు అను దినచర్య ప్రారంభం అయ్యేది.

anu with viaan upsc 4

లేట్ నైట్ లో మేలుకుని ఉండి చదవడం కన్నా.. తెల్లవారు జామున సమయం లో లేచి చదవడమే తనకు ఎంతో ఉపకరించింది అని అను చెప్పుకొచ్చింది. మొదట్లో అను కూడా తల్లి వద్దే ఉండి చదువుకుంది. దగ్గరలో ఓ లైబ్రరీ కి వెళ్లి చదువుకునేది. కానీ, ఇంటికి వచ్చాక అను కొడుకు వియాన్ తల్లి తో సమయం గడపడానికి వచ్చేవాడు. ఆ పిల్లాడిని ఆడిస్తూ చదువుకోవడం అనుకు కష్టమయ్యేది. వియాన్ ను చూస్తూ చదువు పై దృష్టి పెట్టలేకపోయింది. దీనితో వియాన్ ను తల్లి వద్దనే ఉంచేసి గుర్గావ్ కు వచ్చేసింది. అక్కడే, నిరాటంకం గా ప్రిపేర్ అయింది.

anu upsc 3

నిద్రపోవడం కూడా టైం వేస్ట్ అవుతుందేమో అని భావించేంతలా చదివేదాన్ని అని అను ఆరోజుల్ని గుర్తు చేసుకుంది. మంచి కార్పొరేట్ ఉద్యోగం, తన పసిబిడ్డ వియాన్ గుర్తొచ్చినప్పుడల్లా బాధ పడేదాన్ని. చాలా సార్లు డ్రాప్ అయిపోయి వెనక్కి వెళ్లపోవాలనిపించేది. కానీ అలా పట్టు వదిలేయకుండా చదివినందుకు ఇప్పుడు సంతోష పడుతున్నా అని అను చెప్పింది. మొదటి అట్టెంప్ట్ లో అను ఒక్క కట్ ఆఫ్ మార్క్ వద్ద ఫెయిల్ అయింది.

ఆ క్షణం చాలా బాధపడ్డా… తిరిగి తనలో తానె స్థైర్యం నింపుకుని రెండో సారి విజయం సాధించడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. అనుకున్నట్లే విజయం సాధించింది. నేడు ఆమె ఆనందం మాములుగా లేదు. తన విజయం లో తన కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారని, తనకు ఎంతో తోడ్పాటు ను అందించారని అను గర్వం గా చెబుతోంది. పట్టు వదలకుండా ప్రయత్నిస్తే విజయం తప్పక సాధించవచ్చు.. అందుకు అను స్టోరీ నే ఉదాహరణ.


End of Article

You may also like