టాలీవుడ్ నటుడు ఉత్తేజ్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఉత్తేజ్ భార్య పద్మావతి ఈరోజు ఉదయమే తుదిశ్వాస విడిచారు. భార్య దూరం అవడం తో ఉత్తేజ్ పరిస్థితి మరింత బాధాకరం గా ఉంది. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన నటులు.. ఆయన విలపిస్తుంటే చూసి కన్నీరుమున్నీరవుతున్నారు. నటుడు ఉత్తేజ్ భార్య పద్మావతి (48) గత కొంత కాలం గా కాన్సర్ తో బాధపడుతున్నారు.

 

హైద్రాబాదు లోని బసవతారకం కాన్సర్ ఆసుపత్రిలోనే ఆమె చికిత్స తీసుకున్నారు. తాజాగా, ఆమె పరిస్థితి విషమించడం తో ఈరోజు ఉదయమే ఆమె కన్నుమూశారు. మహాప్రస్థానం లో ఆమె అంత్య క్రియలు జరగనున్నాయి. ఉత్తేజ్ ఇంట్లో విషాదం నెలకొనడం తో టాలీవుడ్ దుఃఖం లో మునిగింది. ఉత్తేజ్ భార్య పద్మావతి మరణించారని తెలియడం తో.. మెగాస్టార్ చిరంజీవి వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఉత్తేజ్ ను ధైర్యం గా ఉండాలంటూ పరామర్శించారు.

దాంతో ఉత్తేజ్ కూతురు పాట తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక భావోద్వేగమైన పోస్ట్ పెట్టింది. తన తల్లితో పాటు ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ పాట ఈ విధంగా రాసింది. “అమ్మా లవ్ యు సో మచ్. నిన్ను నేను బాగా మిస్ అవుతాను. నాన్నని, నన్ను, అక్కని తొందరగా వదిలేసి వెళ్లిపోయావు. ఐ లవ్ యు అమ్మా. నా ఫ్యూచర్ ని అలా వదిలేసావ్ ఏంటి అమ్మా. ఐ లవ్ యూ ఫరెవర్ అమ్మా. అమ్మా నువ్వు మళ్ళీ అక్క కడుపులో పుడతావు. నాకు తెలుసు. ఐ లవ్ యు అమ్మా” అని రాసింది.