ధనుష్ “సార్” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

ధనుష్ “సార్” ఫస్ట్ రివ్యూ..! సినిమా ఎలా ఉందంటే..?

by Anudeep

Ads

కోలీవుడ్ స్టార్‌ హీరో ధనుష్‌ తెలుగులో నేరుగా నటించిన మొదటి చిత్రం ‘సార్’. తమిళంలో ‘వాతి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. తొలిప్రేమ, మజ్ను, రంగ్‌దే చిత్రాలతో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. భీమ్లానాయక్‌, బింబిసార చిత్రాలతో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న సంయుక్త ఈ చిత్రం లో హీరోయిన్‌గా నటిస్తోంది. సితార ఎంటర్ టైన్ మెంట్ తో కలిసి ఫార్య్చూన్ ఫోర్ నిర్మాణ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Video Advertisement

ఇప్పటికే పాటలు, టీజర్లు, ట్రైలర్లకు ఊహించని స్పందన రావడంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. సార్ ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎడ్యుకేషన్ కి రిలేటెడ్ సినిమా అని అర్థమైపోతుంది. అయితే ఈ చిత్రానికి సంబంధిన రివ్యూలు తాజాగా నెట్టింట వైరల్ అవుతున్నాయి. దుబాయ్ లో ఉంటూ ఇండియన్ సినిమాలకు ఫస్ట్ రివ్యూ ఇచ్చే సినీ క్రిటిక్, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడిగా చెప్పుకునే ఉమైర్ సంధు సార్ మూవీ రివ్యూ చెప్పేసారు.

umair sandhu review about sir movie..!!

” సార్ సినిమా ఫైనల్ ఎడిటింగ్ పూర్తయ్యింది. ధనుష్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇన్సైడ్ టాక్ చాలా బాగుంది.” అని ఉమైర్ సందు తన ట్విట్టర్ ఖాతా లో పోస్ట్ చేసాడు. ఇంతకు ముందు సార్ ట్రైలర్ రిలీజ్ అయినపుడు కూడా.. ” సార్ ట్రైలర్ చాలా బాగుంది. వైవిధ్యం చూపించే నటుల్లో ధనుష్ ఎప్పుడు ముందుటాడు. ధనుష్ కి ఇంకో హిట్ రాబోతుంది..” అని ట్వీట్ చేసాడు ఉమైర్ సందు. అలాగే.. “సార్ సినిమా రన్ టైం 2 గంటల 17 నిముషాలు. సినిమా బావుంది..” అంటూ మరో రివ్యూయర్ లక్ష్మి కాంత్ ట్వీట్ చేసారు.

umair sandhu review about sir movie..!!

ధనుష్, సంయుక్త జంటగా నటించిన ‘సార్’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఫిబ్రవరి 17, 2023 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. సాయికుమార్, తనికెళ్ల భ‌ర‌ణి, సముద్ర ఖని, తోటపల్లి మధు, నర్రా శ్రీను, పమ్మి సాయి, హైపర్ ఆది, ఆడుకాలం నరేన్, ఇలవరసు, మొట్టా రాజేంద్రన్, హరీష్ పేరడి తదితరులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదల అయిన ‘మాస్టారు మాస్టారు’ సాంగ్‌ ఇప్పటికే చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.


End of Article

You may also like