ప్రస్తుతం ఉన్న టాప్ సీరియల్స్ లో ఒకటి వదినమ్మ. ఈ సీరియల్ లో సుజిత, ప్రభాకర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వదినమ్మ సీరియల్ లో మరొక ముఖ్య పాత్ర పోషిస్తున్నారు ప్రియాంక నాయుడు. ప్రియాంక బెంగళూరు నుంచి వచ్చారు. ప్రియాంకకు చిన్నప్పటి నుంచి బేబీ షామిలి అంటే చాలా ఇష్టం. అలాగే ప్రియాంక, మెగాస్టార్ చిరంజీవికి అభిమాని. 2006 లో మిస్ బెంగళూర్ అవార్డ్ గెలుచుకున్నారు ప్రియాంక.

భీమిలి కబడ్డీ జట్టు కన్నడ రీమేక్ కబడ్డీ సినిమాలో నటించారు. తర్వాత ఆస్కార్ అనే సినిమా కూడా చేశారు. తర్వాత తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ప్రియాంక. తెలుగులో ప్రియాంక మొదటి సినిమా కేరింత. ఈ సినిమాలో హీరోయిన్ శ్రీదివ్యకి స్నేహితురాలిగా నటించారు. తర్వాత అనగనగా ఒక దుర్గ అనే సినిమాలో నటించారు.

 

సినిమాలో మంచి పాత్ర కోసం ఎదురు చూస్తున్న ప్రియాంక కి ఈటీవీ వాళ్ళు సీరియల్ కోసం సంప్రదించారు. ఒక మంచి పాత్ర రావడానికి ఎంత సమయమైనా పట్టొచ్చు. మధ్యలో సమయం వృధా చేయకుండా,ఇంకా సినిమాకి, టెలివిజన్ కి పెద్దగా తేడా అనిపించకపోవడంతో, అలాగే ప్రేక్షకులకు ఇంకా చేరువ అవుతాం అన్న ఉద్దేశంతో సీరియల్స్ లో నటిద్దాం అనుకున్నారట ప్రియాంక.

స్వాతి చినుకులు సీరియల్ లో ప్రియాంక పోషించిన వైషు పాత్ర తనకు ఎంతగానో గుర్తింపుని తీసుకువచ్చింది. ప్రియాంక, మంగమ్మగారి మనవడు సీరియల్ లో నటించిన మధు బాబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు.

ప్రస్తుతం వదినమ్మ సీరియల్ లో సిరి పాత్ర ద్వారా మనల్ని అలరిస్తున్నారు ప్రియాంక. అలాగే జెమినీ టీవీలో ప్రియాంక లీడ్ రోల్ లో నటిస్తున్న దీపారాధన సీరియల్ కూడా ఇటీవల మొదలైంది.

watch video:


తెలుగు కంటెంట్ రైటర్స్ కి తెలుగుఅడ్డా ఆహ్వానం.! Mail us your resume and samples to: teluguaddahr@gmail.com