Ads
చాలా సినిమాలు రియల్ లైఫ్ కి దగ్గరగా ఉంటాయి. ఆ సినిమాలో ఉండే వాళ్ళ పాత్రలు కూడా మనం నిజ జీవితంలో ఎక్కడో చూసినట్టుగా అనిపిస్తుంటాయి. సినిమా ముందుకు వెళ్లే కొద్దీ హీరో హీరోయిన్ల పాత్రల బిహేవియర్ లో కూడా మార్పులు వస్తుంటాయి. అలాంటప్పుడు సినిమా కూడా ప్రోగ్రెస్ అవుతుంది. వాళ్ల క్యారెక్టర్ లో కూడా డెవలప్మెంట్ ఉంటుంది.
Video Advertisement
కొన్ని సినిమాల్లో ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ లేదా క్యారెక్టర్ లో వచ్చే మార్పు అనేది కొంచెం ఎఫెక్టివ్ గా చూపిస్తారు. అందుకు ఒక ఉదాహరణ దాదాపు 12 సంవత్సరాల క్రితం వచ్చిన వైశాలి సినిమా. ఈ సినిమాలో సింధు మీనన్, ఆది పినిశెట్టి హీరో హీరోయిన్లుగా నటించారు. దీని ఒరిజినల్ వెర్షన్ తమిళ్ సినిమా ఈరమ్.
తెలుగులో వైశాలి పేరుతో డబ్ చేశారు. చిత్ర దర్శకుడు అరివళగన్ రొటీన్ కి భిన్నంగా, డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీయడంతో తెలుగు ప్రేక్షకులు కూడా ఈ సినిమాని చాలా బాగా ఆదరించారు. అయితే, సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అదేంటంటే ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ తన చెల్లెలితో కలిసి గుడికి వెళుతుంది.
అక్కడ హీరో కనిపించి మాట్లాడతాడు. కానీ గుడిలో అందరూ ఉంటారు. వాళ్ళు హీరో హీరోయిన్లు మాట్లాడుకోవడం చూస్తారు అని హీరోయిన్ ఇబ్బంది పడుతుంది. తర్వాత హీరోయిన్ కూడా హీరోని ప్రేమిస్తుంది. అప్పుడు హీరోయిన్, హీరోతో గుడిలోనే కూర్చుని మాట్లాడుతుంది. అంటే ఎవరైనా వాళ్ళని చూసినా, ఎవరైనా ఏమైనా అడిగినా తన దగ్గర సమాధానం ఉంది అనే ధైర్యం హీరోయిన్ కి వచ్చినట్టు ఈ సీన్ ద్వారా డైరెక్టర్ మనకు చూపించారు.
End of Article