వైష్ణవి చైతన్య గోల్డెన్ ఛాన్స్..! ఏకంగా దిల్ రాజు బ్యానర్ లో..?

వైష్ణవి చైతన్య గోల్డెన్ ఛాన్స్..! ఏకంగా దిల్ రాజు బ్యానర్ లో..?

by Mohana Priya

షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలు పెట్టి, సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించి, ఇప్పుడు బేబీ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు వైష్ణవి చైతన్య. మొదటి సినిమాతోనే హిట్ కొట్టారు. ఈ సినిమా తర్వాత వైష్ణవి ఎలాంటి సినిమా చేస్తారు అనే విషయం మీద ఆసక్తి నెలకొంది.

Video Advertisement

సాధారణంగా మొదటి సినిమాలో హీరోయిన్లకి నటనపరంగా ఆస్కారం ఉన్న పాత్రలు దొరకడం చాలా తక్కువ. ఎంతో మంది హీరోయిన్లకి ఇలా అరుదుగా జరుగుతుంది. వారిలో వైష్ణవి చైతన్య కూడా ఒకరు. మొదటి సినిమాతోనే పర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్ చేశారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న సినిమాలో నటించి, ఎంతో మంది క్రిటిక్స్ ప్రశంసలు అందుకున్నారు. వైష్ణవి చైతన్య నెక్స్ట్ సినిమా ఇటీవల అనౌన్స్ చేశారు. దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ హీరోగా నటిస్తున్న సినిమాలో వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్నారు. దీనికి సంబంధించి ఇటీవల వైష్ణవి చైతన్య ఫోటోతో పాటు ఒక అనౌన్స్మెంట్ చేశారు. ఈ సినిమాకి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహిస్తున్నారు.

ఆస్కార్ విజేత ఎం ఎం కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రముఖ సీనియర్ సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. ఈ సినిమాకి లవ్ మీ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఇది మాత్రమే కాకుండా వైష్ణవి చైతన్య బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో, సిద్దు జొన్నలగడ్డ హీరోగా రాబోతున్న సినిమాలో కూడా హీరోయిన్ పాత్రలో నటిస్తున్నారు అని సమాచారం. ఏదేమైనా సరే, వైష్ణవి చైతన్య దిల్ రాజు ప్రొడక్షన్ లో హీరోయిన్ గా చేస్తూ ఒక గోల్డెన్ ఛాన్స్ కొట్టేశారు అని అందరూ కామెంట్ చేస్తున్నారు.


You may also like

Leave a Comment