Ads
సినిమాలకి విరామం ఇచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో చేసిన మూవీ వకీల్ సాబ్… పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ మూవీ మంచికి ఇచ్చింది. ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ లాయర్ గెటప్ లో అదరగొట్టారు. ప్రకాష్ రాజుకి పోటాపోటీగా కోర్టు సీనులో రెచ్చిపోయారు. అయితే వకీల్ సాబ్ సినిమా మంచి విజయం సాధించిన సందర్భంగా దానికి సీక్వెల్ రూపొందించాలని మేకర్స్ భావించారు. అయితే ఆ ప్రతిపాదన మళ్ళీ తెరమీదకి రాలేదు.
Video Advertisement
అయితే ఇప్పుడు సరిగ్గా వకీల్ సాబ్ సీక్వెల్ కోసం సరిపోయే సినిమా ఒకటి మలయాళంలో వచ్చింది. అదే నేరు. మోహన్ లాల్ హీరోగా దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా మల్లువుడ్ లో సూపర్ హిట్ దిశగా సాగుతోంది.
సలార్ నుంచి పోటీ ఉన్నా సరే తట్టుకుని మరీ నిలబడింది. నిజానికీ సినిమా మీద వెంకటేష్ ఆసక్తి చూపించారనే టాక్ వచ్చింది కానీ సినిమా చూసిన వాళ్ళు మాత్రం వకీల్ సాబ్ 2కి బాగా సరిపోతుందని భావిస్తున్నారు. కళ్ళు లేని ఒక మధ్య తరగతి యువతిని మంత్రి కొడుకు రేప్ చేస్తే హీరో ఎలా పోరాడి గెలిపించాడనే పాయింట్ మీద ఇది నడుస్తుంది.
కేవలం రెండు ఇళ్ళు, కోర్ట్ రూమ్ సెటప్ లోనే జీతూ జోసెఫ్ రెండున్నర గంటల కంటెంట్ విసుగు రాకుండా నడిపించాడు. రెమ్యునరేషన్లు తప్ప ప్రొడక్షన్ పరంగా ఎంత మాత్రం ఖర్చు లేని సబ్జెక్టిది. ఒకవేళ పవన్ వేగంగా ఏదైనా సినిమా చేయాలనుకుంటే బెస్ట్ ఛాయసవుతుంది. నేరులో హీరోయిన్ ఉండదు. పాటలు అసలే లేవు. కావాలంటే కొంత కమర్షియల్ టచ్ ఇవ్వొచ్చు కానీ టైటిల్స్ నుంచి చివరి దాకా సీరియస్ టోన్ లో సాగుతుంది. ఇప్పటికే ఒక రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాణంలో ఉంది. రాజకీయాల నుండి ఖాళీ అయ్యాక పవన్ కళ్యాణ్ దృష్టి సారిస్తే ఈ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంటుంది.
End of Article