Ads
మార్చి 29 వ తేదీ రానే వచ్చింది. మూడు సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా ట్రైలర్ విడుదల అయ్యింది. ఇప్పటివరకు సినిమా ఎలా ఉండబోతోందో అనే ఆలోచనతో ప్రేక్షకులు ఎదురు చూస్తే ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా విడుదల తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Video Advertisement
ఒక రకంగా చెప్పాలంటే పాటలు టీజర్ పోస్టర్స్ తో కొంచెం కొంచెంగా పెరిగిన ఎగ్జైట్మెంట్ ట్రైలర్ తర్వాత డబల్ అయ్యింది. వకీల్ సాబ్ సినిమా పింక్ సినిమాకి రీమేక్. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పోషించిన పాత్రని హిందీలో అమితాబ్ బచ్చన్ గారు పోషించారు. వకీల్ సాబ్ సినిమాలో నివేతా థామస్, అంజలి, అలాగే మల్లేశం సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనన్య నాగళ్ల కూడా నటిస్తున్నారు.
సినిమా మొత్తంలో ఈ ముగ్గురు పాత్రలు చాలా కీలకమైనవి. అసలు కథ మొత్తం ఈ మూడు పాత్రల చుట్టూనే తిరుగుతుంది. అయితే వకీల్ సాబ్ ట్రైలర్ లో కొంచెం మార్పు ఉంది. అదేంటంటే కోర్టులో హీరో అడిగే ప్రశ్నని తెలుగులో ప్రకాష్ రాజ్ అడుగుతున్నారు. హిందీలో అమితాబ్ బచ్చన్ గారు తాప్సీని ప్రశ్నిస్తారు.
పింక్ సినిమా తమిళ్ లో నేర్కొండ పార్వై పేరుతో రీమేక్ అయ్యింది. ఇందులో అమితాబ్ బచ్చన్ గారు పోషించిన పాత్రని అజిత్ పోషించగా, తాప్సీ పోషించిన పాత్రని శ్రద్ధా శ్రీనాథ్ పోషించారు. హిందీలో చూపించినట్టు గానే తమిళ్ లో కూడా శ్రద్ధా శ్రీనాథ్ ని అజిత్ ప్రశ్నిస్తారు.
కానీ తెలుగుకి వచ్చేటప్పటికి ఆ ప్రశ్న ప్రకాష్ రాజ్ అడుగుతున్నట్లు మనకి ట్రైలర్ లో చూపించారు. తాప్సీ, శ్రద్ధా శ్రీనాథ్ పోషించిన పాత్రని తెలుగులో నివేతా థామస్ పోషిస్తున్నారు. అలాగే అదే ప్రశ్నని హీరో అబ్బాయిలని అడుగుతారు. ఏదేమైనా రీమేక్ అన్న తర్వాత కచ్చితంగా ఎక్కడో ఒక చోట మార్పు ఉంటుంది.
హిందీలో అమితాబ్ బచ్చన్ గారికి ఫ్లాష్ బ్యాక్ లాంటిది ఉండదు. కానీ తమిళంలో అజిత్ కి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అందులో విద్యా బాలన్ ఉంటారు. అలాగే మన తెలుగులో కూడా శృతి హాసన్ ఆ పాత్రని పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా సరే ట్రైలర్ చూస్తూ ఉంటే పింక్ సినిమా ఏ పాయింట్ మీద అయితే రూపొందించారో అదే పాయింట్ తెలుగులో కూడా ప్రెజెంట్ చేస్తున్నట్టు మనందరికీ అర్థమయింది.
End of Article