ఎన్నో తమిళ సినిమాలతో పాటు, కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించి, ఆ తర్వాత బిగ్ బాస్ కంటెస్టెంట్ గా చాలా పాపులర్ అయ్యారు వనిత. వనిత తండ్రి విజయ్ కుమార్ గారు, తల్లి మంజుల గారు కూడా ఫేమస్ నటులు. అలాగే సోదరి అయిన శ్రీదేవి, ఇంకా ప్రీత కూడా ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. అయితే వనిత కొన్ని వ్యాఖ్యల వల్ల చర్చలో నిలుస్తూ ఉంటారు.

బిగ్ బాస్ హౌస్ నుండి వచ్చిన తర్వాత కూడా ఎన్నో సార్లు వనిత పేరు సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే వనిత కొంత కాలం క్రితం ఒక వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇది వనిత మూడవ వివాహం. దాంతో సోషల్ మీడియాలో వనిత కొద్ది రోజులు చర్చలో ఉన్నారు. తర్వాత వారిద్దరు విడిపోయారు. ఇప్పుడు వనిత ఇంకొక వ్యక్తిని వివాహం చేసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

వనిత, తమిళ నటుడు అయిన పవర్ స్టార్ విజయ్ కుమార్ ని పెళ్లి చేసుకున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యింది. దాంతో అందరూ ఇది వనిత 4వ పెళ్లి అని నిర్ధారించుకొని వనితకి శుభాకాంక్షలు చెప్పడం మొదలుపెట్టారు. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఇది వారిద్దరూ సినిమా కోసం ఇచ్చిన స్టిల్. ఏదేమైనా ప్రస్తుతం ఈ ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.