విలక్షణ నటిగా చక్కటి గుర్తింపు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ప్రముఖ కోలీవుడ్ హీరోయిన్ గా మంచి గుర్తింపుని తెచ్చుకుంది వర లక్ష్మి శరత్ కుమార్. నిజానికి సీనియర్ హీరోయిన్స్ అయినటువంటి విజయశాంతి రమ్య కృష్ణ వంటి హీరోయిన్ల తర్వాత అంతటి పేరు తెచ్చుకున్న ఈ తరం హీరోయిన్లలో ఆమె మొదటి స్థానం లో వుంది. ఎటువంటి పాత్రనైనా సరే వరలక్ష్మి చక్కగా చేయగలదు.

Video Advertisement

ఈ మధ్య కాలం లోనే చాలా సినిమాల్లో విలన్ పాత్రలు చేసి అందరిని తన వైపుకి తిప్పేసుకుంది. పాపులారిటీని కూడా బాగా సంపాదించుకుంది.

varalakshmi sarath kumar role in veerasimha reddy..

పైగా తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. సినిమాల్లో విలన్ అయినా రియల్ లైఫ్ లో మాత్రం ఈమె మనసు వెన్న అని మరొకసారి రుజువు చేసుకుంది. మరొకసారి కుటుంబాలకి అండగా నిలిచి తన మనసు ఎంత విశాలమో చాటుకుంది వ రలక్ష్మి. ఈమె ఎప్పటికప్పుడు సామాజిక సేవలు చేస్తూనే ఉంటుంది. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటుంది. క్యాన్సర్ బారిన పడ్డ కుటుంబాలకు నిత్యవసర వస్తువులను అందించడానికి సహాయం చేసింది. శనివారం వర లక్ష్మీ పుట్టిన రోజు అయింది.

ఈ సందర్భంగా ఆమె స్థానిక ఎగ్మోర్ లోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ హాస్పిటల్ లో తన పుట్టిన రోజుని వైద్యులు మరియు క్యాన్సర్ బాధితుల మధ్య జరుపుకుంది. జయ ఆఫ్ షేరింగ్ పేరుతో శివశక్తి సంకల్ప బ్యూటిఫుల్ వరల్డ్ సేవా సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. క్యాన్సర్ బాధ్యతల్ని కాపాడుతున్న వైద్యులు మధ్య పుట్టినరోజు చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని వరలక్ష్మి శరత్ కుమార్ చెప్పింది. చేతిలో ఉన్న డబ్బుల్ని అందిస్తే కూడా చాలా మందికి సహాయం అందుతుందని చెప్పింది అలానే దేశమంతా సైకిల్ యాత్ర చేస్తూ క్యాన్సర్ వ్యాధి మీద అవగాహన కల్పిస్తున్న శివ, రవి, జై అశ్వానిని అభినందించింది వరలక్ష్మి శరత్ కుమార్.